ఫ్యామిలీ స్టార్ లో ఆ సెంటిమెంట్ ఎక్కువట
రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఫ్యామిలీ స్టార్. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కు పెద్ద పీట వేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రీసెంట్ గా చిత్ర టీజర్ ను రిలీజ్ చేశారు.
ఫ్యామిలీ స్టార్ టీజర్ లో లవ్ కంటే ఫ్యామిలీ అంశాలే ఎక్కువుంటాయని టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ మృణాల్ క్యారెక్టర్ కు ఎంత ప్రాధాన్యం ఉంటుందో విజయ్ కు అక్కలుగా నటిస్తున్న వాసుకి, అభినయ పాత్రలకు కూడా అంతే ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది.
కథను డ్రైవ్ చేసే కీలకమైన పాయింట్ ను డైరెక్టర్ ఈ సిస్టర్స్ తోనే ముడిపెట్టాడని సమాచారం. ఫ్యామిలీ స్టార్ ఫస్టాఫ్ ఎంతో ఎంటర్టైన్మెట్ తో ఉండగా, సెకండాఫ్ లో కీలకమైన ఎమోషన్స్ ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటికే ఫ్యామిలీ స్టార్ పై మంచి అంచనాలున్నాయి. ఆల్రెడీ రిలీజైన నందనందనా సాంగ్ చార్ట్ బస్టర్ అయింది. మిగిలిన వాటిని కూడా అదే రేంజ్ లో ప్రమోట్ చేసి రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. గత కొన్ని సినిమాలు తను అనుకుంటున్న రేంజ్ సక్సెస్ రాకపోవడంతో విజయ్ తన ఆశలన్నీ ఫ్యామిలీ స్టార్ పైనే పెట్టుకున్నాడు. మరి ఈ సినిమా విజయ్ కు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.













