Siddhu Jonnalagadda: అలాంటి వాటిని పట్టించుకుని అటెన్షన్ ఇవ్వను

తెలుగు సినీ జర్నలిస్టులు ఈ మధ్య మితిమీరి ప్రవరిస్తున్నారు. సెలబ్రిటీలను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడుగుతూ, వారిని అగౌరవపరుస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల తెలుసు కదా(telusu kadha) ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సిద్ధు జొన్నలగడ్డ(siddhu jonnalagadda)కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ప్రెస్ మీట్ లో ఓ లేడీ జర్నలిస్ట్ మీరు సినిమాల్లో లానే బయట కూడా ఉమెనైజరా అని అడిగింది.
అయితే ఆ ప్రశ్నకు ఈవెంట్ లోనే ఇది నా పర్సనల్ ఇంటర్వ్యూనా, లేక సినిమా ఇంటర్వ్యూనా అని సిద్ధు కౌంటర్ ఇవ్వగా, తెలుసు కదా ప్రమోషన్స్ లో భాగంగా మరోసారి ఈ టాపిక్ ప్రస్తావన రాగా సిద్ధూ దానిపై రెస్పాండ్ అవుతూ ఫైర్ అయ్యారు. ఆమె అలా మాట్లాడటం ఎంతో అగౌరవం అని, మైక్ ఉంది కదా అని అలా మాట్లాడటం కరెక్ట్ కాదన్నాడు సిద్ధు.
తప్పుగా ప్రశ్న అడగటమే కాకుండా నవ్వుతున్నారని, అలాంటి ప్రశ్నకు తానేం సమాధానమిస్తానని, అందుకే అవాయిడ్ చేశానని, హీరో సినిమాలో పోలీసైతే బయట కూడా పోలీస్ గా చేస్తారా? సినిమాకీ బయటకీ తేడా తెలీదా? అయినా ఈ విషయం తనను కాకుండా, అలా ఎందుకు అన్నారో ఆమెనే అడగాలని, ఇవన్నీ పట్టించుకుని వాటికి తాను ఎక్కువ అటెన్షన్ ఇవ్వనని ఏదొక రోజు వాళ్లే తాము చేసింది తప్పని తెలుసుకుంటారని సిద్ధు చెప్పుకొచ్చాడు.