మిస్టర్ బచ్చన్లో టిల్లూ బాయ్
రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మిస్టర్ బచ్చన్. బాలీవుడ్ హిట్ రైడ్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్ట్ 15న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిపోయింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ సినిమా ద్వారా భాగ్య శ్రీ బోర్సే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ట్రైలర్ ను రిలీజ్ చేసి ప్రమోషన్స్ ను వేగవంతం చేయాలని మేకర్స్ చూస్తున్నారు. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రవితేజకు మిస్టర్ బచ్చన్ హిట్ ఎంతో కీలకం. ఇటు హరీష్ శంకర్ కు కూడా ఈ సినిమా హిట్ అవసరమే.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. ఈ సినిమాలో స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ ఓ సర్ప్రైజింగ్ క్యామియో చేయబోతున్నాడని టాక్. జులై 30న ఈ క్యారెక్టర్ కు సంబంధించిన షూటింగ్ జరగనుందని, ఈ షూటింగ్ లో సిద్దూ తో పాటూ రవితేజ కూడా పాల్గొనున్నాడని తెలుస్తోంది. వీరిద్దరి పై కీలక సన్నివేశాలను హరీష్ శంకర్ తెరకెక్కించనున్నాడట. ఈ సీన్ సినిమా క్లైమాక్స్ లో హైలైట్ గా నిలుస్తోందంటున్నారు. మరి ఇందులో నిజమెంతన్నది చూడాలి.













