పెళ్లి తర్వాత కలిసి సినిమా చేయనున్న బాలీవుడ్ జంట
బాలీవుడ్ లో పెళ్లయ్యాక జంటగా నటించడం ట్రెండ్ గా మారింది. సైఫ్ అలీఖాన్(Saif Ali Khan)- కరీనా కపూర్(Kareena Kapoor), రణ్బీర్(Ranbir)- ఆలియా భట్(Alia Bhatt) ఇప్పటికే పెళ్లి తర్వాత కూడా జంటగా నటించారు. ఇప్పుడు సిద్ధార్థ్ మల్హోత్రా(Siddharth Malhotra)- కియారా అద్వాణీ(Kiara Advani) కలిసి నటించేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. వీరిద్దరూ కలిసి ఇప్పటికే పలు సినిమాల్లో నటించారు.
కానీ పెళ్లయ్యాక మాత్రం ఇద్దరూ కలిసి నటించే అవకాశం ఇప్పటివరకు రాలేదు. వేరే హీరోలతో కియారా, ఇతర హీరోయిన్లతో సిద్ధార్థ్ నటిస్తున్నారు. కానీ ఇద్దరూ కలిసి మాత్రం నటించలేదు. వీరిద్దరూ కలిసి త్వరలోనే ఓ ప్రేమ కథలో నటించనున్నట్లు సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ మడాక్ ఫిల్మ్స్(Madaak Films) ఈ సినిమాను నిర్మించనుంది.
వచ్చే ఏడాది ప్రారంభంలో షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రటకన త్వరలోనే వచ్చే అవకాశముంది. ఇదిలా ఉంటే కియారా ప్రస్తుతం గేమ్ ఛేంజర్(Game Changer), డాన్3(Don3), వార్2(War2) లాంటి క్రేజీ సినిమాల్లో నటిస్తుండగా, సిద్ధార్థ్ మల్హోత్రా రేస్4(race4) సినిమా చేస్తున్నాడు. వీరు నటిస్తున్న సినిమాలన్నీ భారీ అంచనాలతో కూడుకున్నవే.













