Prabhas: ప్రభాస్ కోసం శ్యామలా దేవి ప్రత్యేక పూజలు

కృష్ణం రాజు(Krishnam Raju) చనిపోయాక ఆ కుటుంబ బాధ్యతలు మొత్తాన్ని ప్రభాస్(Prabhas) తన భుజాలపై వేసుకున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ కు తన పెద్దనాన్న అన్నా, పెద్దమ్మ శ్యామలా దేవి(Syamala Devi) అన్నా తన కుటుంబమన్నా ఎంతో ఇష్టం. శ్యామలా దేవికి కూడా ప్రభాస్ అంటే చాలా ఇష్టం. అయితే తాజాగా శ్యామలా దేవి తన కొడుకు ప్రభాస్ కోసం ప్రత్యేక పూజలు చేసినట్టు తెలుస్తోంది.
శ్యామలా దేవి కాకినాడలోని తలుపులమ్మ తల్లి ఆలయాన్ని దర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నట్టు తెలుస్తోంది. ప్రతీ ఏటా లానే ఈ ఏడాది కూడా ఆమె గుడికి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారని తెలుస్తోంది. ఇంట్లోని పెద్దలు, తమ సంతానం, బంధువుల శ్రేయస్సు కోసం సాంప్రదాయంగా నిర్వహించే ఆచారంలో భాగంగానే శ్యామలా దేవి ఆలయాన్ని దర్శించుకున్నారని కొందరంటున్నారు.
మరికొందరు మాత్రం ప్రభాస్ ఆరోగ్యం నయమవడానికే ప్రత్యేక పూజాలు చేశారని అంటున్నారు. కొన్నాళ్లుగా ప్రభాస్ ఎక్కువగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అందులో ముఖ్యంగా మోకాలి సమస్యతో ప్రభాస్ పదే పదే బాధ పడుతున్నారు. దాని వల్లే షూటింగుల నుంచి బ్రేక్ కూడా తీసుకున్నారు ప్రభాస్. తన కొడుకు ఆరోగ్య సమస్యలు తొలగిపోవాలనే శ్యామలా దేవి అమ్మవారి దర్శనం చేసుకున్నారని అంటున్నారు. అయితే శ్యామలా దేవి మాత్రం ఆ సమయంలో మీడియా అక్కడికి వచ్చినా ఏమీ మాట్లాడకపోవడం విశేషం.