హాలోవీన్ వేడుకల్లో శ్రుతీ హాసన్
నేను ఏ మాత్రం ఊహించని జీవితాన్ని ఆస్వాదిస్తున్నా. ఈ స్థాయికి రావడాన్ని ఎంతో ఆదృష్టంగా భావిస్తున్నా అని శ్రుతీ హాసన్ అన్నారు. ఆమె ప్రస్తుతం లాస్ ఏంజిల్స్‌లో ఉన్నారు. ఫ్రెండ్స్‌తో కలిసి హాలోవీన్ వేడుకల్లో పాల్గొన్నారు. జీవితంలో చాలా చాలా ఆనందంగా ఉన్నాను. ఈ స్థాయికి కారణమైన అవకాశాలకు, అడ్డంకులకు, సమస్తానికీ ధన్యవాదాలు చెబుతున్నా అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దాంతో పాటు తన బోయ్ ఫ్రెండ్ మైఖేల్ కోర్సలే పేరును కూడా ప్రస్తావించారు. ఆమె చేతిలో ప్రస్తుతం తెలుగు, తమిళంలో శభాష్ నాయుడు, హిందీలో ఓ చిత్రం ఉన్నాయి.













