Shruti Haasan: నాపై ఎన్నో రూమర్లు వచ్చాయి!
శృతి హాసన్. ఈమె గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. లోక నాయకుడు కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ చాలా తక్కువ టైమ్ లోనే తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకుని నటిగా, గాయనిగా, మ్యూజిక్ డైరెక్టర్ గా పలు రంగాల్లో సత్తా చాటుతోంది. అయితే శృతి గతంలో కొన్ని సార్లు ప్రేమలో పడి, దాని వల్ల చాలా తీవ్రంగా బాధపడిన సంగతి తెలిసిందే.
ఈ విషయాన్ని తానే చాలా ఓపెన్ గా మాట్లాడుతూ, తన లవ్ స్టోరీస్ వేరే వాళ్లకు సిల్లీగా అనిపించినా, తనకు వేరేగా ఉంటుందని చెప్పిన అమ్మడు తన తండ్రి ప్రతీ విషయంలోనూ తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని తెలిపింది. తన తండ్రి తనకు ఏ విషయంలోనూ అడ్డు చెప్పలేదని, దాని వల్ల తానెప్పుడూ జీవితంలో ఇబ్బంది పడింది లేదని శృతి చెప్పుకొచ్చింది.
తనపై ఎన్నో రూమర్లు వచ్చాయని, వాటిలో కొన్ని నిజాలుంటే, కొన్ని అబద్ధాలుంటాయని, కానీ తన తండ్రి మాత్రం ఎప్పుడూ తనకు సపోర్ట్ గానే నిలిచారని, తన తండ్రి ఓ వ్యక్తిగా ఎంతో మందిలో స్పూర్తిని నింపారని, అందుకే తనకు తన తండ్రి అంటే ఎంతో అభిమానమని చెప్పింది శృతి. సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ, తాను మాత్రం సొంతంగానే ఈ పొజిషన్ కు వచ్చినట్టు శృతి పేర్కొంది.






