Coolie: శృతి పాత్ర చుట్టూ ట్విస్టులే

ఒకప్పుడు సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన శృతి హాసన్(Shruthi Hassan) కు మధ్యలో కొన్నాళ్లు ఆఫర్లు తగ్గాయి. కాటమరాయుడు సినిమా తర్వాత శృతి హాసన్ అడపా దడపా మాత్రమే సినిమాలు చేస్తూ వచ్చింది. మళ్లీ సలార్(salaar) తో ఫామ్ లోకి వచ్చిన శృతి హాసన్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్(lokesh kanagaraj) దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన కూలీ(Coolie) సినిమాలో కీలక పాత్రలో నటించింది.
అయితే శృతి ఈ సినిమాలో హీరోయిన్ కాదు. కేవలం కీలక పాత్రలో మాత్రమే నటించింది. హీరోయిన్ కాకపోయినా కూలీ కథ, అందులోని ట్విస్టులన్నీ ఆమె ద్వారానే రివీల్ అవుతాయని కోలీవుడ్ వర్గాలంటున్నాయి. హార్బర్ లో జరిగే మాఫియా గురించి బయటపెట్టే వ్యక్తిగా సత్యరాజ్(satyaraj) నటిస్తుండగా, అతని కూతురి పాత్రలో శృతి నటిస్తోంది. ఉన్నట్టుండి మాయమైన తన తండ్రిని వెతికే నేపథ్యంలో శృతికి ఎన్నో విషయాలు తెలుస్తాయని, వాటి ద్వారా శృతి ప్రమాదంలో పడుతుందని అంటున్నారు.
ఆ ప్రమాదం నుంచి తన తండ్రికి స్నేహితుడైన రజినీ ఆమెను రక్షించి, ఆ తర్వాత ఇద్దరూ కలిసి సత్యరాజ్ ను వెతుకుతారని అంటున్నారు. ఇదే నిజమైతే శృతికి చాలా కాలం తర్వాత ఎంతో మంచి పాత్ర దక్కినట్టవుతుంది. అయితే కూలీ సినిమా విషయంలో ఎన్ని వార్తలొస్తున్నా వాటిని అసలు పట్టించుకోకుండా ఉంటున్నాడు డైరెక్టర్ లోకేష్. కూలీ సినిమా ఆగస్ట్ 14న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.