Shruthi Hassan: రజినీపై శృతి ప్రశంసలు

సూపర్ స్టార్ రజినీకాంత్(rajinikanth), లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) కాంబినేషన్ లో రానున్న సినిమా కూలీ(Coolie). గ్యాంగ్‌స్టర్ డ్రామాగా భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఆగస్ట్ 14న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. విక్రమ్(Vikram), లియో(Leo) సినిమా తర్వాత లోకేష్ నుంచి వస్తున్న సినిమా కావడం, దానికి తోడు ఇప్పటికే కూలీ నుంచి రిలీజ్ చేసిన కంటెంట్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో కూలీపై అందరికీ విపరీతమైన ఆసక్తి నెలకొంది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమాలో శృతి హాసన్(Shruthi Hassan) హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, రీసెంట్ గా శృతి ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొని రజినీకాంత్ తో తన వర్క్ ఎక్స్‌పీరియెన్స్ ను షేర్ చేసుకుంది. తమిళ ఇండస్ట్రీకి తన తండ్రి కమల్ హాసన్(kamal Hassan), సూపర్ స్టార్ రజినీకాంత్ రెండు మూల స్థంభాలని అభిప్రాయపడింది.
అందరి లానే తనకు కూడా రజినీకాంత్ సూపర్ స్టార్ లాగానే తెలుసని, కానీ కూలీ సినిమా షూటింగ్ టైమ్ లో ఆయన గురించి మరింత తెలుసుకున్నానని, ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అని, చాలా కూల్ పర్సన్ అని చెప్పింది. రజినీ సర్ కూల్ గా ఉండటం వల్ల ఆయనతో మాట్లాడటం కూడా చాలా ఈజీ అని తాను రజినీతో చెప్పినట్టు శృతి వెల్లడించింది. ఆయన సెట్స్ లోకి వస్తే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని, ఆయనతో కలిసి వర్క్ చేయడం అందరికీ ఎంతో సంతోషాన్నిస్తుందని శృతి చెప్పగా, ఆమె రజినీ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.