అందులో నిజం లేదు… వట్టి పుకార్లే
దశాబ్ద కాలం పాటు దక్షిణాదిలో టాప్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ శ్రియ గురించి తాజాగా ఓ వార్త జోరుగా ప్రచారం జరుగుతోంది. రష్యాకు చెందిన వ్యక్తిని ప్రేమిస్తుందనీ త్వరలో వీరిద్దరి వివాహం జరగనుందంటూ వార్తలొస్తున్నాయి. ముఖ్యంగా శ్రియతో పాటు అతగాడున్న ఫొటోలను సోషల్ మీడియాతో పోస్టు చేస్తూ నానా రచ్చ చేస్తున్నారు. ఈ విషయంపై శ్రియ స్పందిస్తూ మాపై వస్తున్న వార్తల్ని గమనిస్తాను అయితే ఇలాంటి వార్తలు చాలా బాధపెడతాయి. ముఖ్యంగా నా కుటుంబ సభ్యులను కలవర పరుస్తాయి. ఇలాంటి వార్తలు విన్నపుడు భయమేస్తుంది. నా పెళ్లి గురించి వస్తున్న వార్తలన్నీ వట్టి పుకార్లే. నేను వివాహం చేసుకుంటానని వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అందతా ఉత్త అబద్దమే, నటిగా దశాబ్దానికి పైగా ప్రయాణం సాగిస్తున్నాను. వృత్తిని అస్వాదించినప్పుడే నటిగా కొనసాగగలం అన్నారు.













