Shreya Ghoshal: పహల్గాం దాడితో శ్రేయా కాన్సర్ట్ రద్దు
పహల్గాం(Pahalgam) ఉగ్రదాడిలో 28 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడి తర్వాత దేశంలోని పరిస్థితుల్లో ఎన్నో మార్పులొచ్చాయి. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ సింగర్లు తమ మ్యూజిక్ షో లను రద్దు చేసుకుంటున్నారు. ఇప్పటికే అర్జిత్ సింగ్(Arjith Singh) ఏప్రిల్ 27న చెన్నైలో జరగాల్సిన షో ను రద్దు చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఆయన దారిలోనే శ్రేయా ఘోషల్(Shreya Ghoshal) కూడా తన మ్యూజికల్ కాన్సర్ట్ ను క్యాన్సిల్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది. మామూలుగా అయితే ఇవాళ శ్రేయా కాన్సర్ట్ సూరత్ లో జరగాల్సి ఉంది. కానీ పహల్గాం దాడి తర్వాత జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని శ్రేయా తన షో ను క్యాన్సిల్ చేస్తున్నట్టు తెలిపింది. ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్న వారికి ఆ డబ్బును తిరిగి రీఫండ్ రూపంలో ఇచ్చేస్తామని కూడా శ్రేయా టీమ్ వెల్లడించింది.
ఆల్ హార్ట్స్ టూర్(All Hearts Tour) పేరుతో దేశ విదేశాల్లో మ్యూజికల్ కాన్సర్ట్ లు నిర్వహిస్తూ వస్తోంది. ఇప్పటికే హైదరాబాద్, చెన్నై, కోయంబత్తూరులో మ్యూజిక్ షో లు చేసిన శ్రేయా ఇవాళ సూరత్ షో ను క్యాన్సిల్ చేసింది. దేశంలోని పరిస్థితులను అర్థం చేసుకుని శ్రేయా(Shreya) తన మ్యూజిక్ షో ను క్యాన్సిల్ చేసుకోవడంపై నెటిజన్లు అందరూ ఆమెను సోషల్ మీడియాలో ప్రశంసిస్తున్నారు.






