వేశ్వపాత్రలో బ్యూటీ హీరోయిన్
శ్రద్ధాదాస్ తెలుగులో సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తోంది. అందుకే ప్రయోగాత్మక పాత్రల్లో నటించి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. కొరియోగ్రాఫర్ విద్యాసాగర్ దర్శకుడిగా ఒక చిత్రాన్ని డైరెక్టు చేయనున్నారు. జగపతిబాబు ప్రధాన పాత్ర పోషించనున్న ఈ చిత్రంలో శ్రద్దాదాస్ ఒక వేశ్యపాత్రలో నటించనుంది. కథ ప్రకారం ఫ్లాస్బ్యాక్లో వచ్చేలా శ్రద్దా పాత్ర సినిమాకు చాలా ప్రధానమైంది. అందులో బలమైన భావోద్వేగాలతో పాటు నటనకు ఆస్కారముందని తెలుస్తోంది. అందుకే శ్రద్ధా ఆ క్యారెక్టర్ చేయటానికి ఒప్పుకుందని తెలిసింది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. చాలా రోజుల తర్వాత శ్రద్ధా పూర్తిస్థాయిలో నటించనున్న సినిమా కావటం విశేషం.













