బ్లాక్ చీరలో మతి పోగొడుతున్న శ్రద్దదాస్…
శ్రధ్ద దాస్ ..ఈ అమ్మడు చేసిన సినిమాలు వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. అయినా కుర్రకారు గుండెల్లో తన హాట్ పిక్స్ తో ఎప్పటికప్పుడు హుషారు పుట్టిస్తుంది. డిజైన్ ఏదైనా దుమ్ములేపాల్సిందే! అన్నది శ్రద్దా దాస్ నినాదం. ఈ బ్యూటీ టెంప్టింగ్ ఎలివేషన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆన్ స్క్రీన్ అయినా, ఆఫ్ స్క్రీన్ అయినా శ్రద్దా అందాల ప్రదర్శన ఒకేలా ఉంటుంది.
ఎలాంటి డిజైనర్ ఎంపికైనా అందులో శ్రద్దా మార్క్ కనిపిస్తుంది. బికినీ ధరించినా, ప్లోరల్ దుస్తుల్లో మెరిసినా, చీర కట్టినా గ్లామర్ ట్రీట్ పక్కా. తాజాగా శ్రద్ధ మరోసారి చీరలో దాగిన తన అందాలని ఆవిష్కరించింది. బ్లాక్ర సారీ లో అద్భుతాలు సృష్టించింది అని చెప్పాలి. వివిధ భంగిమల్లో ఈ అమ్మడు కెమెరా కి ఫోజులిచ్చింది. డిజైనర్ బ్లౌజ్ ఈ సారీ కి మరింత అందాన్ని తీసుకొచ్చింది.
ఆమె ధరించిన ఇయర్ రింగ్స్ శ్రద్దలో బ్యూటీని మరింత హైలైట్ చేస్తున్నాయి. బ్లాక్ చీరలో తెలుపు అందాలు మిరిమిట్లు గొలుపుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అమ్మడి అభిమానుల్ని ఓ రేంజ్ లో ఆకట్టుకుంటున్నాయి. నెటిజన్స్ సైతం శ్రద్ధ బ్యూటీ కి ఫిదా అంటున్నారు.
ఇప్పటికే నటిగా అవకాశాలు లేక ఖాళీగా ఉంటుంది ఈ బ్యూటీ. కొన్ని టీవీషోలతో టైంపాస్ చేస్తోంది. వెబ్ సిరీస్ లు లాంటివి అందుబాటులో ఉన్నా ఆ రకమైన ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించలేదు. బాలీవుడ్ లోనూ కొన్ని సినిమాలు చేసింది. కానీ అక్కడా నటిగా బిజీ కాలేకపోయింది. ఈ క్రేజ్ ఇలా కొనసాగుతున్నపుడే శ్రద్ధ దాస్ తన కెరీర్ ని చక్కబెట్టుకొని మరిన్ని ఆఫర్స్ ని సొంతం చేసుకోవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.













