Sivani Rajasekhar: ఆ బయోపిక్ లో శివానీకి ఛాన్స్
హీరో ఆర్. మాధవన్(R. Madhavan) ప్రధాన పాత్రలో ప్రముఖ శాస్త్రవేత్త గోపాలస్వామి దొరైస్వామి నాయుడు బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వినిపిస్తోంది. ఈ మూవీలో ఓ కీలక పాత్ర కోసం సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు శివానీ రాజశేఖర్(Shivani Rajasekhar) ను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.
జూన్ నుంచి శివానీ, జీడీ నాయుడు(GD Naidu) మూవీ షూటింగ్ లో పాల్గొననున్నట్టు సమాచారం. ఈ మూవీలో మాధవన్ తో పాటూ శివానీ స్క్రీన్ ను షేర్ చేసుకోనుంది. గత సినిమాల్లో శివానీ నటనను చూసిన దర్శకనిర్మాతలు ఈ క్యారెక్టర్ కు శివానీ అయితేనే న్యాయం చేయగలదని భావించి ఆమెను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. జీడీ నాయుడు బయోపిక్ లో శివానీ పాత్ర చాలా స్పెషల్ గా ఉంటుందని, శివానీ కెరీర్లోనే ఈ మూవీ ఓ మైలురాయిగా నిలవనుందని అంటున్నారు.
ఎవడైతే నాకేంటి(Evadaithe nakenti), సత్యమేవ జయతే(Satyameya Jayathe), కల్కి(Kalki) సినిమాలను నిర్మించిన శివానీ తర్వాత 2 స్టేట్స్(2 States) తో హీరోయిన్ గా మారింది. ఆల్రెడీ తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాల్లో నటించి మెప్పించిన శివానీ ఇప్పుడు జీడీ నాయుడు బయోపిక్ లో అవకాశం అందుకుంది. కృష్ణకుమార్ రామకుమార్(Krishnakumar Ramakumar) దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో ప్రియమణి(Priyamani), జయరాం(Jayaram), యోగిబాబు(Yogi babu) కీలకపాత్రల్లో కనిపించనున్నారు.













