దళపతి… సరేనన్నాడా?
సుధీర్‌వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో శర్వానంద్ డాన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి ఇంతకుముందు వరకు కీరవాణి అనే టైటిల్ వినిపించింది. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి దళపతి అనే పేరు పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. మణిరత్నం దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన సినిమా దళపతి పేరుతో విడుదలై విజయదుందుభి మ్రోగించింది. మధ్యలో కొన్ని డబ్బింగ్ సినిమాలు దళపతి పేరుతో వచ్చినప్పటికీ పెద్ద హీరోల సినిమాలేవీ ఆ పేరుతో రాలేదు. ఇప్పుడు శర్వానంద్ సినిమాకి ఆ పేరు పేట్టే ఆలోచన చేస్తున్నారు. మరి ఈ టైటిల్ శర్వా సరేనన్నాడో లేదో చూడాలి.













