షకీలా కొత్త ప్రయత్నం
షకీలా ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథా చిత్రం. విక్రాంత్, పల్లవి ఘోష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 24 క్రాప్ట్ పతాకంపై సీవీ రెడ్డి సమర్పణలో సీహెచ్ వెంకట్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సతీష్ వీఎన్ దర్శకుడు. ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ కార్యక్రమం హైదరాబాద్ ఫిలింఛాంబర్లో జరిగింది. ఈ సందర్భంగా షకీలా మాట్లాడుతూ నేను చేసిన ప్రతి సినిమా అసభ్యత అనే ముద్రపడింది. నేను కుటుంబ కథా చిత్రాలు చేయలేనా అనే ఆలోచన నుంచి పుట్టిన చిత్రమిది. నేను చేసిన సినిమాలు అంటేనే సెన్సార్ ఇవ్వడం లేదు. ఇది నేను రాసిన కథ కాబట్టి, ఈ దర్శక నిర్మాతలు ఎన్ని ఇబ్బందులు పడతారో. ఇది పూర్తిగా కుటుంబ కథా చిత్రమని చెప్పగలను అన్నారు.













