సైంటిస్ట్ గా షారుఖ్ ఖాన్
బ్రహ్మాస్త్ర కోసం సైంటిస్ట్ గా మారారు షారుక్ ఖాన్. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం బ్రహ్మాస్త్ర. ఇందులో అమితాబ్ బచ్చన్, నాగార్జున, డింపుల్ కపాడియా కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రంలో షారుక్ ఖాన్ సైంటిస్ట్‌గా ఓ గెస్ట్ రోల్ చేశారని బాలీవుడ్ సమాచారం. షారుక్ సన్నివేశాలతోనే ఈ చిత్రం మొదలవుతుందట. కరోనా వైరస్ ప్రభావంతో ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం వాయిదా పడింది. మరో వైపు జీరో (2018) చిత్రం తర్వాత షారుక్ ఖాన్ హీరోగా నటించే చిత్రంపై ఇప్పటివరకు సరైన సృష్టత రాలేదు. తమిళ దర్శకుడు అట్లీతో ఓ హిందీ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.













