టాలీవుడ్‌కు సెప్టెంబర్ షాక్!
సెప్టెంబర్‌లో టాలీవుడ్ బాక్సాఫీస్‌కు ఆశించిన స్థాయిలో ఊపు రాలేదు. సమ్మర్ తర్వాత వరుస సక్సెస్‌లతో ట్రాక్‌లోకి వచ్చిన ఇండస్ట్రీ.. ఈ నెలలో మాత్రం ఒక్క స్ట్రెయిట్ క్లీన్ హిట్‌ను కూడా అందుకోలేకపోయింది. అంతకు ముందు పెద్ది(peddi)తో పాటు మా ఇంటి బంగారం(maa inti bangaram), లెనిన్(lenin), కొరియన్ కనకరాజు(Corian kanakaraj), చెన్నై లవ్ స్టోరీ(Chennai love story), విశ్వనాథం అండ్ సన్స్(Viswanath and sons), ఇరుముడి(irumudi) వంటి సినిమాలు ఆడియన్స్ ను థియేటర్ల వైపు తీసుకొచ్చాయి. దీంతో సెప్టెంబర్‌పై కూడా ఇండస్ట్రీలో మంచి అంచనాలే ఏర్పడ్డాయి.
అయితే ఈ నెలలో రిలీజైన రోమాంచకం(romanchakam), రంభ- ఊర్వశి- మేనక(rambha oorvasi menaka), సర్దార్2(Sardar2), ఎపిక్(Epic) వంటి సినిమాలు ఆ అంచనాలను అందుకోలేకపోయాయి. కంటెంట్ పరంగా ఆడియన్స్ ను మెప్పించడంలో విఫలమవడంతో ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద గట్టిగా నిలబడలేకపోయింది. ముఖ్యంగా కొన్ని సినిమాలకు ఓపెనింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో రాకపోవడం గమనార్హం. దీంతో సెప్టెంబర్‌ను టాలీవుడ్ మరో నిరాశాజనకమైన నెలగా ముగించాల్సి వచ్చింది.
ఇక నాని(nani) నటించిన ప్యారడైజ్(paradise) మాత్రం ఈ నెల బాక్సాఫీస్ డిస్కషన్ లో స్పెషల్ గా నిలిచింది. రిలీజ్ కు ముందు భారీ అంచనాలున్నా.. ప్రీమియర్ల తర్వాత మిక్డ్స్ రెస్పాన్స్ ఎదురైంది. అయినప్పటికీ ఆ టాక్‌ను తట్టుకుని సినిమా కలెక్షన్లు సాధించడం ఇంట్రెస్టింగ్ గా మారింది. నాని ప్రమోషన్లు, అతడిపై ఉన్న నమ్మకం సినిమాకు కొంత బలాన్నిచ్చాయి. నిర్మాతలు బ్రేక్ ఈవెన్ సాధించామని అనౌన్స్ చేయడం ఈ సినిమాకు ఊరటగా మారింది. మొత్తంగా క్లీన్ హిట్ లేకపోయినా.. సెప్టెంబర్‌లో బాక్సాఫీస్ హడావుడికి ప్యారడైజ్, ఇరుముడి(irumudi) కొంత మేర కారణమయ్యాయి.








