మహేష్ బాబు ప్రశంసలతో డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ పై ఆసక్తి
ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli) కొడుకు కార్తికేయ(karthikeya) నిర్మాతగా పరిచయం అవుతున్న డోంట్ ట్రబుల్ ది ట్రబుల్(Dont trouble the trouble) రిలీజ్ కు ముందే సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్(Fahad faasil) ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు శశాంక్(Sashank) దర్శకత్వం వహించారు. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు తాజాగా సూపర్‌స్టార్ మహేష్ బాబు(mahesh babu) నుంచి వచ్చిన ప్రశంసలు మరింత హైప్ తీసుకొచ్చాయి.
ప్రైవేట్ స్క్రీనింగ్‌లో సినిమాను వీక్షించిన మహేష్ బాబు.. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ తనకు పూర్తి స్థాయి మూవీ ఎక్స్‌పీరియెన్స్ ను అందించిందని పేర్కొన్నారు. ఎంటర్టైన్మెంట్ తో పాటూ ఎమోషన్స్ ను సమపాళ్లలో అందించిన సినిమాగా దీన్ని అభివర్ణిస్తూ, డైరెక్టర్ పనితీరును ప్రశంసించారు. ముఖ్యంగా ఫహాద్ ఫాజిల్ యాక్టింగ్ తనను ఆకట్టుకుందని, ఆయనతో పాటు చిన్నారి సారా(Saara) కూడా అద్భుతంగా నటించిందని మహేష్ తన సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఇక నిర్మాతగా కార్తికేయకు ఇది ప్రత్యేకమైన ఆరంభమని మహేష్ బాబు అభినందించారు. కార్తికేయ, శోభు యార్లగడ్డ(Sobhu yarlagadda) కలిసి మంచి సినిమాను అందించారని ప్రశంసలు కురిపించారు. డైరెక్టర్ శశాంక్ ఈ ప్రపంచాన్ని తెరపై చక్కగా ఆవిష్కరించారని పేర్కొంటూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) హాజరయ్యారు. కాగా మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వారణాసి(Varanasi) సినిమాలో నటిస్తుండగా, ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న థియేటర్లలోకి రానుంది.








