రజనీ మూవీకి శ్రీలీల గ్లామర్
తెలుగు సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న సూపర్‌స్టార్ రజనీకాంత్(rajinikanth) కొత్త సినిమా ధర్మన్(dharman) పై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే తమిళంతో పాటు టాలీవుడ్‌కు చెందిన పలువురు నటీనటులు ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతుండగా.. తాజాగా మరో క్రేజీ హీరోయిన్ చేరింది. యంగ్ హీరోయిన్ శ్రీలీల(sree leela) ధర్మన్ లో కీలక పాత్రకు ఎంపికైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మైసూరులో జరుగుతున్న షూటింగ్లో ఆమె పాల్గొంటూ తన పాత్రకు సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేస్తోంది.
ఇప్పటికే టాలీవుడ్ హీరో రామ్(ram) కూడా ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ కోసం టీమ్‌తో జాయిన్ అయ్యాడు. దీంతో ధర్మన్ లో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నటీనటుల భాగస్వామ్యం మరింత పెరిగింది. మరోవైపు సిమ్రాన్(simran), రాశీ ఖన్నా(raashi khann), యోగిబాబు(yogi babu) వంటి నటులు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమాలో రజనీకాంత్ డాక్టర్ పాత్రలో కనిపించనున్నారనే సమాచారం సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది.
షూటింగ్‌ను వీలైనంత వేగంగా పూర్తి చేసేలా చిత్రబృందం వరుస షెడ్యూల్స్‌తో ముందుకు వెళ్తోంది. సంక్రాంతి 2027 టార్గెట్‌గా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అశ్వత్ మారిముత్తు(Aswath marimuthu) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రాజ్‌కమల్ ఫిల్మ్స్(rajkumar films) ఇంటర్నేషనల్ నిర్మిస్తోంది. అనిరుధ్ రవిచందర్(anirudh ravichander) సంగీతం అందిస్తుండగా.. రెడ్ జెయింట్(Red jaint) మూవీస్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమాను రిలీజ్ చేయనుంది.








