ఆటోలో వచ్చి షాక్ ఇచ్చిన రజినీ!
మైసూర్లో ధర్మన్(dharman)0 షూటింగ్‌తో సూపర్‌స్టార్ రజినీకాంత్(rajinikanth) సందడి చేస్తున్నారు. షూటింగ్ లొకేషన్‌కు ఆయన ఆటోరిక్షాలో రావడం అక్కడి ఫ్యాన్స్ కు సడెన్ సర్ప్రైజ్గా మారింది. సెక్యూరిటీ సిబ్బంది మధ్య ఆటోలో వచ్చిన రజినీకాంత్‌ను చూసేందుకు భారీ సంఖ్యలో ఫ్యాన్స్ గుమిగూడారు. వారిని గమనించిన ఆయన ఆటోలో నుంచే అభివాదం చేశారు. ఫ్యాన్స్ కేరింతలు కొనసాగడంతో మరోసారి బయటకు వచ్చి వారికి చేతులు ఊపుతూ పలకరించారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇదిలా ఉంటే మైసూర్ షెడ్యూల్‌తో ధర్మన్ కు సంబంధించిన కాస్టింగ్‌పై కూడా ఆసక్తి పెరుగుతోంది. రజినీకాంత్‌తో పాటు రాశీ ఖన్నా(raashi khanna), సిమ్రాన్(Simran), యోగిబాబు(Yogibabu) ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. రామ్ పోతినేని(ram pothineni) కూడా సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారనే ప్రచారానికి మైసూర్లో రజినీకాంత్‌తో కలిసి ఆయన కనిపించిన ఫొటోలు మరింత బలాన్ని చేకూర్చాయి. ఇక శ్రీలీల(Sree Leela) కూడా ఈ సినిమాలో నటిస్తున్నారనే డిస్కషన్ మొదలైంది. అయితే ఆమె పాత్రపై మేకర్స్ నుంచి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.
కమల్ హాసన్(kamal haasan) నిర్మాణంలో రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్(rajkamal films international) బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు అశ్వత్ మారిముత్తు(Aswath marimuthu) దర్శకత్వం వహిస్తున్నారు. రజినీకాంత్ ఇందులో డాక్టర్ పాత్రలో కనిపించనుండగా, ఫస్ట్ లుక్‌లో ది డెడ్లీ డాక్టర్ అనే ఇంట్రెస్టింగ్ ట్యాగ్‌లైన్‌ను పరిచయం చేశారు. అనిరుధ్(Anirudh) మ్యూజిక్ అందిస్తున్న ధర్మన్ ను సంక్రాంతి 2027 కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.








