పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సిరిసిల్ల.. ఉరిసిల్లగా మారింది: సీఎం రేవంత్ రెడ్డి
సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి గారి స్పీచ్ పాయింట్స్
సిరిసిల్ల అంటే సిరులకు నిలయం. కానీ గత బీఆర్ఎస్ పాలనలో తీసుకున్న నిర్ణయాల వల్ల సిరిసిల్లను ఊరిసిల్లగా మార్చారు.
మనిషి నాగరికత వస్త్రంతో ప్రారంభమైంది. అలాంటి వస్త్రాలకు సిరిసిల్ల అడ్డా. చేనేత కార్మికులు, చేతివృత్తులకు ఇది సిసలైన కేంద్రం. అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారు చేయడం ఇక్కడి నేత కార్మికుల ప్రత్యేకత.
తెలంగాణ ఉద్యమ సమయంలో పాపారావు, కేకే మహేందర్‌రెడ్డి వంటి వారు సిరిసిల్ల అభివృద్ధి కోసం పనిచేస్తే… చీమలు పెట్టిన పుట్టలో విషపు పాములు చేరినట్టుగా కేసీఆర్, కేటీఆర్ సిరిసిల్లలో రాజకీయంగా ముందుకు వచ్చి పెద్ద ఎత్తున దోచుకున్నారు.
2009 ఎన్నికల్లో కేవలం 172 ఓట్లతో సిరిసిల్లలో కేటీఆర్ గెలిచారని, ఆ తర్వాత అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్ష కోట్ల మేర భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నారు. అవన్నీ ఎట్ల వచ్చినయ్? దుబాయ్ పాసుపోర్టు బ్రోకర్ కొడుకుగా… అమెరికాలో అంట్లు తొమిని… హోటళ్ళలో చిప్పలు కడిగిన వాడికి ఇన్ని కోట్లు ఎలా వచ్చాయి?
దాదాపు అర డజను సార్లు సిరిసిల్లో కేటీఆర్‌ను గెలిపించినా ఇక్కడి చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఎందుకు ఆగలేదు?
గల్ఫ్ దేశాలకు వలసలు ఎందుకు తగ్గలేదని నిలదీశారు. విదేశాలకు వెళ్లిన వలస కార్మికులు పడుతున్న ఇబ్బందులను అందరం చూస్తున్నాం. ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్న వారు సిరిసిల్ల ప్రజలకు ఏం చేశారో ఆలోచించుకోవాలి.
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వలస కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ఆది శ్రీనివాస్, ఎరవర్తి అనిల్ ఎన్నోసార్లు ప్రతిపాదనలు తీసుకొచ్చారని తెలిపారు. అందుకే తమ ప్రభుత్వం వలస కార్మికుల కోసం ప్రత్యేక విధానం తీసుకొచ్చి, ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల సహాయం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.
2004, 2006, 2008 ఎన్నికల్లో కేసీఆర్‌ను గెలిపించిన కరీంనగర్ ప్రజలను 2009లో వదిలేసి పాలమూరుకు వెళ్లారు. కరీంనగర్ ప్రజల లాగానే మా పాలమూరు బిడ్డలు కూడా మంచివాళ్లని, అందుకే కేసీఆర్‌ను 2009 పార్లమెంటు ఎన్నికల్లో గెలిపించారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా పాలమూరు ప్రజలను మోసం చేసి, గజ్వేల్‌కు వెళ్లిపోయారని ఆరోపించారు.
అమెరికాలో కేటీఆర్ పనిచేసిన సమయంలో బాత్రూమ్లు కడిగినా, హోటళ్లలో పాత్రలు కడిగినా.. అంత తక్కువ కాలంలోనే లక్షల కోట్ల రూపాయల సంపద ఎలా వచ్చిందో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహేశ్‌కుమార్ గౌడ్ ప్రశ్నించారని, అదే ప్రశ్నను తాను కూడా అడుగుతున్నా.
సిరిసిల్ల ప్రజలు కూడా విదేశాలకు వలస వెళ్తున్నారని, వారు ఎంత సంపాదిస్తున్నారో మనకి తెలుస్తుందని కానీ, కేటీఆర్ సంపద ఎలా పెరిగిందో ప్రజలు ప్రశ్నించాలి.
‘ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా?’ … మానేరు ఇసుక దోపిడీ జరిగింది. నేరెళ్ల ఘటనలో దళితులపై పోలీసులు దాడి చేశారు, కరెంటు షాక్ పెట్టి వారి జీవితాలను నాశనం చేశారు. ఇవన్నీ కేసీఆర్ సడ్డకుడి కొడుకు సంతోష్ చేశాడు కదా.
మిడ్‌మానేరు ప్రాజెక్టు కారణంగా ఇళ్లు కోల్పోయిన సమయంలో 2015లో ఆయన సడ్డకుడి కొడుకు కుటుంబ సభ్యుల పేర్లతో ఇళ్లను పొందారు. ఆనాడు తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారిగా చూపించిన వారు తర్వాత కోట్లాది రూపాయల ఆస్తులు ఎలా సంపాదించారు.
ఒకరు గోదావరి జలాలను కొల్లగొట్టారని, ఇంకొకరు మానేరు ఇసుకను దోచుకున్నారని, మరొకరు హైదరాబాద్‌లో ఆంధ్ర వ్యాపారులతో చేతులు కలిపి వేల కోట్ల రూపాయలు, భారీగా భూములు సంపాదించారు.
నేత కార్మికులు, గీత కార్మికులు, రైతులను ఆదుకుంటామని చెప్పి.. చివరకు వారిని గోదావరిలో నట్టేట ముంచారు.
వేములవాడ రాజన్నకు, భద్రాద్రి రాముడికి కూడా శఠగోపం పెట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ ఒక్కరే. 2014 అధికారంలో వచ్చాక… ఈ రెండు దేవాలయాలకు నిధులు ఇస్తానని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వని దుర్మార్గులు.
తమ ప్రభుత్వం కేవలం రెండున్నరేళ్లలో చేనేత కార్మికుల కోసం రూ.1,730 కోట్లు ఖర్చు చేసిందని సీఎం తెలిపారు. అదే గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో రూ.2000 కోట్లు మాత్రమే ఖర్చు చేశాం.
వేములవాడ అభివృద్ధికి రూ.1,500 కోట్లు ఇచ్చామని, ఇక్కడే యంగ్ ఇండియా స్కూల్, ఎంఆర్ఓ కార్యాలయాలు, మహిళా పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా ద్వారా రైతులను ఆదుకున్నాం.
‘పిల్లకాకికి ఏం తెలుసు ఉండేలు దెబ్బ’ అన్నట్టు అమెరికా హోటళ్లలో పాత్రలు కడిగిన కేటీఆర్‌కు రాజకీయ దెబ్బ అంటే ఏమిటో 2023లో కాంగ్రెస్ కార్యకర్తలు ఇచ్చిన దెబ్బను ఆయన తండ్రిని అడిగి తెలుసుకోవాలి.
గజ్వేల్ గడిపై గురిపెట్టి అక్కడ బీఆర్ఎస్ను ఓడించామని, ఇప్పుడు సిరిసిల్ల గడిపై గురిపెట్టి కాంగ్రెస్ కార్యకర్తలు మర ఫిరంగుల్లా పేలుతారు. సిరిసిల్లలో పాదయాత్ర చేస్తుంటే ప్రజల కళ్లలో మార్పు స్పష్టంగా కనిపించింది.
రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక పద్మశాలి బిడ్డను పెద్దల సభకు పంపించాలని, సిరిసిల్ల నుంచి గెలిచిన ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇచ్చేలా చూడాలని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌ను కోరుతున్నా.
సిరిసిల్లలో ఓట్లు వేస్తే గతంలో కల్వకుంట్ల కుటుంబానికి పెద్ద ఎత్తున పచ్చ నోట్లు వచ్చి పడ్డాయి. తెలంగాణలో రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, పొన్నం ప్రభాకర్ మంత్రులుగా ఉన్నారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే ఎర్రబెల్లి దయాకర్‌రావు, తన సడ్డకుడి కొడుకు సంతోష్‌రావుకు ఎంపీ పదవులు వచ్చాయి.
ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్‌గా వినోద్‌కుమార్‌ను కేసీఆర్ నియమిస్తే… తాను బీసీ బిడ్డ గద్వాల విజయలక్ష్మిని ఆ స్థానంలో నియమించా. నిజామాబాద్‌లో కేసీఆర్ కుమార్తెను ఓడించిన తర్వాత ఆమెకు వెంటనే ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని, తాను మాత్రం తెలంగాణ కోసం పోరాడిన విజయశాంతిని ఎమ్మెల్సీగా చేశా.
కాంగ్రెస్ పార్టీ బీసీ బిడ్డ మహేశ్‌కుమార్ గౌడ్‌ను పీసీసీ అధ్యక్షుడిగా చేసిందని, గతంలో వైఎస్–డీఎస్ జోడీ ఉంటే.. ఇప్పుడు రేవంత్–మహేశ్ జోడీ బలంగా పని చేస్తుంది ప్రజా సంక్షేమం కోసం తెలంగాణలో.
దళిత ముఖ్యమంత్రి చేస్తానని, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తానని, ప్రతి ఇంటికీ ఉద్యోగం ఇస్తానని కేసీఆర్ హామీలు ఇచ్చా కదా. కానీ వాటిలో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు ఎందుకు? బదులుగా కుటుంబ ఆస్తులు, ఫామ్‌హౌస్‌లు పెంచుకున్నారు. ఇదంతా యావత్ తెలంగాణ చూసింది.
మీ ఫామ్‌హౌస్‌లు మాత్రం సకాలంలో పూర్తి చేసుకున్నారు.. మరి పేదల కోసం ఇచ్చిన హామీలను ఎందుకు పూర్తి చేయలేదు?. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఎందుకు నిర్మించలేదు.
ఇవన్నీ చేయకుండా నన్ను రిబ్బన్ కట్టింగ్ సీఎం అంటే ఏంటీ? మీరు చేయని పనులను నేను వచ్చి… చేసిన తర్వాత రిబ్బన్ కడుతున్న. మీ ఫాంహౌసులు, ప్రగతి భవన్ లు సకాలంలో పూర్తి అవుతాయి. పేదల ఇండ్లు మాత్రం కావా?
బీఆర్ఎస్ నాయకులను బడికి రాని బడి దొంగలు… ఆఖరికి బతుకమ్మ చీరల పంపిణీలో కూడా కమిషన్లు తీసుకున్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చాక, మా అధికారి శైలజా రామయ్యర్ వచ్చి అడిగిన తర్వాత చేనేత కార్మికులకు బతుకమ్మ చీరల బకాయిలను చెల్లించాం.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల ఆత్మగౌరవానికి సంబంధించిన రేషన్ కార్డులు ఇవ్వలేదని, సన్నబియ్యం ఇవ్వలేదని, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేదని విమర్శించారు.
రా బిడ్డా.. అసెంబ్లీకి. చర్చ పెడదాం. నువ్వు ఏం ఇచ్చావో.. నేను ఏం ఇచ్చానో అక్కడే చెబుదాం అంటూ కేటీఆర్ కు సవాల్ విసురుతున్న. ఈ పనికిమాలిని శ్వేత పత్రాలు ఎందుకు?
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. బస్సుల్లో టికెట్ అడిగితే మీ తమ్ముడు రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఉచిత ప్రయాణం అని… నా ఫోటోను చూపించాలని మహిళలకు సూచించా
మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతి నెల ఆర్టీసీకి నిధులు చెల్లిస్తున్నారని, రెండున్నరేళ్లలో రూ.12 వేల కోట్లు చెల్లించాం.
పండుగ సందర్భంగా మహిళలు తమ ప్రభుత్వం అందించిన చీరలు కట్టుకుని వచ్చారని, గత ప్రభుత్వం ఇచ్చిన చీరలను ప్రజలు వ్యవసాయ పొలాల్లో పిట్టలు, కాకులను తరిమేందుకు ఉపయోగించేవారు.
గతంలో పాలపిట్ట రంగు చీరలు ఇచ్చారని, ఈసారి చిలుకపచ్చ చీరలు ఇస్తాం మా ఆడబిడ్డలకు.
గత పాలకులు మాత్రం, ఇసుక నుంచి చీరల వరకు, కాంట్రాక్టుల నుంచి లిక్కర్ కమిషన్ల వరకు అన్ని రంగాల్లో దందా… దోపిడీ జరిగింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని హామీలను అమలు చేస్తోంది. ఇప్పటికే 75 వేల ఉద్యోగాలను భర్తీ చేశాం. అప్పుల్లో ఉన్న తెలంగాణను, విధ్వంసానికి గురైన తెలంగాణను అభివృద్ధి, వికాసం వైపు తీసుకెళ్తున్నాం.
తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు, చాకలి ఐలమ్మ మనవరాలికి, నేరెళ్ల శారదకు కీలక పదవులు ఇచ్చాం. మహిళలకు, బీసీలకు, దళితులకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది..
నేను సిరిసిల్ల ప్రజలను అడుగుతున్న… మళ్లీ గడీల వైపు, రాతియుగం వైపు వెళ్లాలా? లేక ప్రజల తెలంగాణ వైపు ముందుకు సాగాలా?
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఒక దళితుడిని స్పీకర్‌గా నియమించిందని, ఆయనను ‘అధ్యక్షా’ అని సంబోధించాల్సి వస్తుందనే కారణంతోనే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు. దళిత స్పీకర్‌పై జరిగిన వ్యాఖ్యలను కేసీఆర్ కనీసం ఖండించలేదు ఎందుకు?
దళితులు వస్తే పసుపు నీళ్లతో కడుతారా? అంత అహంకారం ఎందుకు?… మన ప్రాంత దళితులు ఆకలినైనా భరిస్తారని, కానీ అవమానాన్ని మాత్రం భరించరని గుర్తుంచుకోవాలి. 21వ శతాబ్దంలో కూడా దళితులపై ఇలాంటి అరాచకం ఎందుకో సమాధానం చెప్పాలి.
కేటీఆర్ తన ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలి. కేటీఆర్‌కు దమ్ముంటే కేసీఆర్, హరీశ్‌రావు, సంతోష్‌రావు ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలి. జన్వాడలో కేటీఆర్ ఫామ్‌హౌస్, శంకర్‌పల్లిలో సోదరి కవిత ఫామ్‌హౌస్, మోయినాబాద్లో హరీష్ రావు ఫామ్‌హౌస్, ఎర్రవెల్లి అయ్య కేసీఆర్ ఫాంహౌసులు ఉన్నాయి కదా. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి?
హైటెక్ సిటీ చుట్టుపక్కల డెక్కన్ సెరాయ్, ఎట్ హోమ్ సర్వీస్ అపార్ట్మెంట్లు, దాదాపు 400 గదుల హోటళ్ల ఎక్కడి నుంచి వచ్చాయి కేటీఆర్ కు? వీటిపై సమాధానం చెప్పే దమ్ము కేటీఆర్ కు ఉందా?
అమెరికా, సింగపూర్‌లో కూడా పెట్టుబడులు ఉన్నాయి కదా? ఇవన్నీ ఇంతవరకు ఎందుకు చెప్పలేదంటే? పార్ట్-2 ఉంది కదా.
తాను ఉన్నది ఉన్నట్లుగా సిరిసిల్ల ప్రజలకు చెప్పాలనుకుంటున్నా. సిరిసిల్ల ప్రజల జీవితాలు మాత్రం పెద్దగా మారలేదని, కొందరి జీవితాలు మాత్రం అనూహ్యంగా ఎలా మారిపోయాయో ప్రజలు ఆలోచించాలి.
సిరిసిల్లలో కాంగ్రెస్ గెలిస్తే ఆ అభ్యర్థికి మంత్రి పదవి ఇచ్చి ప్రజలకు అండగా నిలుస్తాం. సిరిసిల్ల ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చే బాధ్యతను తాను స్వయంగా తీసుకుంటా
బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్ మీకు గతం. ఇకపై అంతా కాంగ్రెస్.. అంతా మూడు రంగుల జెండానే
2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని సిరిసిల్ల ప్రజలకు చెబుతున్నా. సిరిసిల్లను అభివృద్ధి చేసే బాధ్యతను తానే తీసుకుంటా.
నేరెళ్ల బాధితులను సాక్షిగా… బీఆర్ఎస్ రాజకీయాలకు ముగింపు పలికేందుకు సిరిసిల్ల ప్రజలు సిద్ధంగా ఉన్నారని నమ్ముతున్నా.








