ఉల్లాలా ఉల్లాలా తో నా కోరిక తీరింది
ప్రతినాయకుడిగా పలు చిత్రాల్లో మెప్పించిన నటుడు సత్యప్రకాష్. 11 భాషల్లో 500కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన తొలిసారిగా మెగాఫోన్ పట్టారు. ఉల్లాలా ఉల్లాలా పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఎ.గురురాజ్ నిర్మిస్తున్నారు. నటరాజ్, నూరిన్, అంకిత ప్రధాన పాత్రధారులు. చిత్రీకరణ తుదిదశకు చేరుకొంది. సత్యప్రకాష్ మాట్లాడుతూ నటుడిగా నా ప్రయాణం ఎంతో సంతృప్తినిచ్చింది. దర్శకత్వం చేయాలని ఎప్పట్నుంచో ఉన్న కోరిక ఈ చిత్రంతో తీరింది. ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్. వినోదాత్మకంగా సాగుతుందన్నారు. దర్శకుడిగా ఆయనలో మంచి ప్రతిభ ఉంది. త్వరలోనే విడుదల చేస్తామన్నారు నిర్మాత.













