బాలకృష్ణ బోయపాటి ల BB3 చిత్రంలో అఖిల్ హీరోయిన్ సాయేషా సైగల్
”సింహ, లెజెండ్” సినిమాలతో భారీ హిట్స్ రాబట్టి BB3 రూపంలో హాట్రిక్ దిశగా అడుగులు వేస్తోంది బోయపాటి- బాలకృష్ణ కాంబో. ఇప్పటికే విడుదలైన BB 3 ఫస్ట్ రోర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది. ఈ సినిమాకు ‘టార్చ్‌బేరర్’ అనే డిఫరెంట్ టైటిల్ ఫిక్స్ చేశారననే టాక్ నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. ఈ సినిమాకు మిర్యాల రవీంద్రనాథ్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తుండగా థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.
అయితే ఎట్టకేలకు BB3 లో బాలయ్య సరసన నటించబోతున్న హీరోయిన్ విషయంలో క్లారిటీ వచ్చేసింది. తాను ఈ భారీ ప్రాజెక్టులో భాగం కాబోతున్నట్లు యంగ్ హీరోయిన్ సాయేషా సైగల్ ట్వీట్ చేసింది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, నందమూరి నటసింహం బాలకృష్ణ కాంబోలో తెరకెక్కుతున్న భారీ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ బయటకొచ్చింది. ఈ సినిమాలో బాలయ్య సరసన నటించబోతున్న హీరోయిన్ విషయంలో క్లారిటీ వచ్చేసింది. గత కొన్ని నెలలుగా బోయపాటి శ్రీను- బాలయ్య కాంబోలో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గురించి చర్చలు నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా హీరోయిన్ సాయేషా ట్వీట్‌తో ఆ చర్చలకు ఫుల్స్టాప్ పడింది. బీబీ 3లో తానే హీరోయిన్గా నటిస్తున్నట్లు కన్ఫర్మ్ చేస్తూ ట్వీట్ చేసింది సాయేషా. లాక్డౌన్ ముందే షూటింగ్ ప్రారంభించిన BB 3. కరోనా కారణంగా గత కొన్ని నెలలుగా షూటింగ్ వాయిదా వేసుకుంది.
ఇటీవలే షూటింగ్స్ రీ ఓపెన్ కావడంతో తిరిగి సెట్స్ పైకి వచ్చేశారు. అయితే ఈ మూవీలో బాలయ్య సరసన నటించబోయే హీరోయిన్ విషయమై ఎంతోమందిని పరిశీలించిన మీదట దర్శకనిర్మాతలు చివరకు మలయాళ భామ ప్రయాగ మార్టిన్‌ని ఫైనల్ చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ చివరి క్షణంలో కొన్ని కారణాల వల్ల ఆమెను ఈ ప్రాజెక్టు నుంచి తప్పించినట్లు తెలిసింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ మరోసారి కన్ఫ్యూజన్లో పడిపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా కన్ఫ్యూజన్కి తెరదించుతూ తాను BB 3లో భాగం కానున్నట్లు సాయేషా ఏ స్వయంగా తెలిపింది. ఈ భారీ ప్రాజెక్టులో అవకాశం దక్కడం గౌరవంగా ఫీల్ అవుతున్నానని, అతి త్వరలో షూటింగ్లో పాల్గొనబోతున్నానని పేర్కొంటూ చాలా ఆతృతగా ఉందని తెలిపింది సాయేషా. కాగా కథ పరంగా ఈ సినిమాలో మరో హీరోయిన్‌కి కూడా ఛాన్స్ ఉందనే సమాచారాలు వస్తున్నప్పటికీ దీనిపై యూనిట్ నుంచి ఇంకా క్లారిటీ రాలేదు.













