సర్కారు వారి పాట.. మరో హీరోయిన్ కోసం వేట!
గీతా గోవిందం తర్వాత చాలా గ్యాప్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు తో సర్కారు వారి పాట పేరుతో సినిమా తెరకెక్కిస్తున్నాడు పరశురామ్ పెట్లా. 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కొన్ని రోజులుగా దుబాయ్ లో షూటింగ్ తో రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. బ్యాంక్ స్కామ్స్ ను టార్గెట్ చేసేలా సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఇప్పుడు ఈ సినిమా స్టోరీలో పరశురామ్ కొన్ని ఛేంజెస్ చేసినట్లు సమాచారం.
కథ మార్పులో భాగంగా ఓ కీ రోల్ కోసం మరో హీరోయిన్ ని తీసుకోవాలని చూస్తున్నాడట దర్శకుడు. సినిమాను టర్న్ చేసే క్యారెక్టర్ అవడంతో ఈ పాత్ర కోసం స్టార్ హీరోయిన్ కోసం వెతుకుతున్నాడట పరశురామ్. సర్కారు వారి పాటను క్లాస్ మరియు మాస్ మిక్స్ చేసి ఆడియన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టే విధంగా ఈ సినిమాను పరశురామ్ రెడీ చేస్తున్నట్లు సమాచారం. మహేష్ బాబు కెరీర్ లో 27వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా 2022 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.













