Sanvi Sudeep: సినిమాల్లోకి రానున్న సుదీప్ కూతురు
కన్నడ హీరో కిచ్చ సుదీప్(Kicha Sudeep) తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఈగ(eega) మూవీతో తెలుగు ఆడియన్స్ కు గుర్తుండిపోయిన సుదీప్ తర్వాత నుంచి తాను కన్నడలో చేసిన సినిమాలన్నింటినీ తెలుగు లో కూడా రిలీజ్ చేస్తున్నాడు. మధ్యలో బాహుబలి(Baahubali) సినిమాలో ఓ చిన్న రోల్ లో కనిపించిన సుదీప్ ఆ తర్వాత ఎలాంటి తెలుగు సినిమాలు చేయలేదు.
ప్రస్తుతం కన్నడలో పలు సినిమాలతో బిజీగా ఉన్న సుదీప్ రీసెంట్ గా మ్యాక్(Max) మూవీతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు కన్నడ బిగ్ బాస్(Bigg Boss) కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సుదీప్, స్క్రీన్ పై చాలా ఫిట్ గా కనిపిస్తాడు. సుదీప్ కు 52 ఏళ్లంటే ఎవరూ నమ్మరు. అంతేకాదు ఆయనకు 21 ఏళ్ల కూతురు కూడా ఉంది.
సుదీప్ కూతురు సాన్వీ సుదీప్(Sanvi Sudeep)కు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే తన అందాలతో నెట్టింట మంచి క్రేజ్ దక్కించుకున్న సాన్వీ సుదీప్, త్వరలోనే సినిమాల్లోకి రానుందని శాండిల్వుడ్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. కానీ సాన్వీకి యాక్టింగ్ కంటే సింగింగ్ అంటేనే ఎక్కువ ఇష్టం. ఇప్పటికే సాన్వీ పలు మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా చేసింది. అందులో భాగంగానే సాన్వీ జిమ్మీ(Jimmy) అనే మూవీలో ఓ సాంగ్ కూడా పాడింది. ఇప్పుడు సాన్వీ త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుందంటున్నారు.













