Santhana Prapathirastu: “సంతాన ప్రాప్తిరస్తు” మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ – మధుర శ్రీధర్ రెడ్డి
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన “సంతాన ప్రాప్తిరస్తు” (Santhana Prapathirastu) సినిమా ఈ రోజు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చి అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని సెంటర్స్ నుంచి ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వస్తోంది. ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి రూపొందించారు. “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా బాక్సాఫీస్ సక్సెస్ అందుకున్న నేపథ్యంలో ఈ మూవీ టీమ్ ప్రెస్ మీట్ ద్వారా తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో
నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ – మా “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అంటూ ప్రేక్షకుల ఆదరణ లభిస్తోంది. ఒక ఎంటర్ టైనింగ్ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో మా సినిమా సక్సెస్ తో అర్థమైంది. ఆయ్, లిటిల్ హార్ట్స్ తర్వాత అలాంటి హోల్ సమ్ ఎంటర్ టైనర్ మా మూవీ అని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాల నుంచి మంచి టాక్ ఉంది. నైజాంతో పాటు విజయవాడ, విశాఖ, రాజమండ్రి, ఒంగోలు..ఇలా ప్రతి ఏరియా నుంచి డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్స్ చేసి సినిమా బాగుందని చెబుతున్నారు. క్రిటిక్స్ నుంచి రివ్యూస్ చాలా పాజిటివ్ గా వచ్చాయి. ప్రతి రివ్యూలో నటీనటుల గురించి, టెక్నీషియన్స్ పనితనం గురించి ప్రశంసిస్తూ చెబుతున్నారు. విక్రాంత్, చాందినీ చౌదరి కెమిస్ట్రీ బాగుందని, మురళీధర్ గౌడ్, తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, తాగుబోతు రమేష్..ఇలా మెయిన్ కాస్ట్ అంతా తమ నటనతో ఆకట్టుకుంటున్నారు. ఈ సినిమాతో నాకు అజయ్ అరసాడ రూపంలో మరో టాలెంటెడ్ టెక్నీషియన్ దొరికాడు. ఆయన ఈ సినిమాకు ఇచ్చిన బీజీఎం ఆకర్షణగా మారింది. సినిమాకు ఎంత పర్పెక్ట్ గా ప్రీ ప్రొడక్షన్ చేసుకుంటే ఔట్ పుట్ అంత బాగా వస్తుందని మా “సంతాన ప్రాప్తిరస్తు” మూవీ మరోసారి ప్రూవ్ చేసింది. వచ్చే మంగళవారం లేదా బుధవారం సక్సెస్ మీట్ ఏర్పాటు చేస్తాం. అన్నారు.
హీరో విక్రాంత్ మాట్లాడుతూ – సినిమా రిలీజ్ కు ముందు రోజు రాత్రి టెన్షన్ తో నిద్రపట్టలేదు. మార్నింగ్ బుక్ మై షో చూస్తే మేజర్ థియేటర్స్ లో బుకింగ్స్ బాగా జరగడం చూసి సర్ ప్రైజ్ అయ్యాను. రివ్యూస్ ఒక్కొక్కటిగా పాజిటివ్ గా రావడం సంతోషంగా అనిపించింది. సినిమాకు వస్తున్న పాజిటివ్ ఫీడ్ బ్యాక్ చూసి మేము ఏడాదిన్నరగా ఈ సినిమా కోసం పడిన కష్టం మర్చిపోయాం. సినిమాటిక్ లిబర్టీ తీసుకోకుండా చాలా జాగ్రత్తగా మూవీ చేశాం. ఆ ఫలితం మాకు దక్కిందని అనిపిస్తోంది. ఆర్టిస్టుల పర్ ఫార్మెన్స్ ల గురించి, టెక్నీషియన్స్ వర్క్ గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. సాంగ్స్ అందరికీ నచ్చాయి. మేమంతా థియేటర్స్ కు వెళ్లి ఆడియెన్స్ మధ్యలో వారి రెస్పాన్స్ చూడబోతున్నాం. ఆ తర్వాత సక్సెస్ మీట్ లో మీ అందరినీ కలుస్తాం. అన్నారు.
హీరోయిన్ చాందినీ చౌదరి మాట్లాడుతూ – “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని మేము ప్రమోషన్ లో చెబుతూ వచ్చాం. ఈ రోజు థియేటర్స్ లో సినిమా చూస్తున్న ఆడియెన్స్ కూడా అదే ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. థియేటర్స్ కు వెళ్లి చూశాను. ఆడియెన్స్ ఎలా రెస్పాండ్ అవుతున్నారో చూశాక హ్యాపీగా అనిపించింది. మా మూవీ హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అనేది ప్రేక్షకులు చెబుతున్నారు. రివ్యూస్ తో పాటు సోషల్ మీడియాలోనూ పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ ఆదరణ ఇలాగే కంటిన్యూ అయితే మేము కంప్లీట్ గా సక్సెస్ అయినట్లే. మా సినిమా హిట్ చేసిన ఆడియెన్స్ అందరికీ థ్యాంక్స్. అన్నారు.
డైరెక్టర్ సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ – ఒక సోషల్ ఇష్యూ చుట్టూ ఎంటర్ టైన్ మెంట్ ఫిల్ చేసి ఎంగేజ్ చేసేలా సినిమా చేశారంటూ ప్రశంసలు వస్తున్నాయి. అలాగే ఈ సినిమాను కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లా ఎలాంటి అసభ్యత లేకుండా చూపించారంటూ అప్రిషియేట్ చేస్తున్నారు. కొత్త తరహా కంటెంట్ చూపిస్తే తాము ఆదరిస్తామని తెలుగు ఆడియెన్స్ మరోసారి ప్రూవ్ చేశారు. మాకే కాదు వేరే ఫిలింమేకర్స్ కు కూడా ఇది ఇన్స్ పైరింగ్ సక్సెస్ అని చెప్పవచ్చు. షేక్ దావూద్ గారి అనుభవం మరోసారి స్క్రీన్ మీద కనిపించింది. ఆయన స్క్రీన్ ప్లే తో పాటు కల్యాణ్ రాఘవ్ డైలాగ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అజయ్ అరసాడ బీజీఎంతో పాటు తెలుసా నీ కోసమే పాటకు కూడా థియేటర్ లో మంచి రెస్పాన్స్ వస్తోంది. హీరో హీరోయిన్స్ సక్సెస్ టూర్ కు వెళ్తున్నారు. వచ్చాక సక్సెస్ మీట్ లో కలుసుకుంటాం. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ మాట్లాడుతూ – థియేటర్ లో మా ఫ్యామిలీ మెంబర్స్ తో సినిమా చూశాను. హీరో విక్రాంత్ క్యారెక్టర్ కొన్ని స్ట్రగుల్స్ లో ఉన్నప్పుడు మా అమ్మ బాధపడుతూ చెబుతోంది. పెద్దవాళ్లు మా మూవీలోని ఎమోషన్ కు కనెక్ట్ అయితే యూత్ కామెడీని ఎంజాయ్ చేస్తున్నారు. మ్యూజిక్ కు మంచి ఫీడ్ బ్యాక్ రావడం హ్యాపీగా ఉంది. అన్నారు.






