చిరంజీవికి సంక్రాంతి చిక్కులు!
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నటిస్తున్న రెండు భారీ సినిమాల రిలీజ్ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్లో ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన విశ్వంభర(Vishwambhara)తో పాటు బాబీ కొల్లి(Bobby kolli) దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాకా(kaaka) సినిమాను కూడా 2027 సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ఆయా నిర్మాతలు సిద్ధమవుతున్నారు. గతంలోనే ఇరు సినిమాల నిర్మాతలతో చిరంజీవి చర్చలు జరిపినప్పటికీ రిలీజ్ డేట్స్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదని తెలుస్తోంది. దీంతో చిరంజీవి ఎలాంటి డెసిషన్ తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
విశ్వంభర నిర్మాణానికి భారీగా ఖర్చు చేయడంతో పాటు రిలీజ్ ఆలస్యం కారణంగా నిర్మాతలపై ఆర్థిక భారం పెరుగుతోంది. మరోవైపు డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ సైతం సంక్రాంతికే సినిమాను రిలీజ్ చేయాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకు పండగ సీజన్ కలిసొస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు. అయితే షూటింగ్ మొదలు పెట్టకముందే కాకా రిలీజ్ ను సంక్రాంతికి ఫిక్స్ చేయడం మరో సమస్యగా మారింది.
వశిష్ఠ(Vassishta) దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్(UV Creations) నిర్మించిన విశ్వంభర రిలీజ్‌కు రెడీగా ఉండగా, కేవీఎన్ ప్రొడక్షన్స్(KVN Productions) నిర్మిస్తున్న కాకా షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంది. రెండు సినిమాలపైనా ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒకే హీరో నటించిన రెండు భారీ సినిమాలను ఒకేసారి రిలీజ్ చేయడం వ్యాపారపరంగా సవాల్‌తో కూడుకున్న వ్యవహారం. ఈ నేపథ్యంలో నిర్మాతల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చిరంజీవి త్వరలోనే ఫైనల్ డెసిషన్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది.







