Sankranthi 2026: ఆ సీజన్ మరోసారి రిపీటవుతుందా?
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతిని బాగా సెలబ్రేట్ చేసుకుంటారనే సంగతి తెలిసిందే. అందుకే ఆ పండక్కి ఎక్కువ సెలవులుంటాయి. ఆ సెలవులని, ఫ్యామిలీస్ ను టార్గెట్ చేసి పలు సినిమాలను రిలీజ్ చేసి నిర్మాతలు లాభ పడుతుంటారు. ఎప్పటిలానే వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా పలు సినిమాలు రిలీజ్ కానుండగా, ఈ సారి పండక్కి గతంలో పోటీ పడిన వాళ్లే మరోసారి పడనున్నారు.
నెక్ట్స్ ఇయర్ సంక్రాంతికి రానున్న సినిమాల్లో అందరికంటే మొదటిగా అనౌన్స్ చేసింది మెగా 157(mega157). చిరూ, అనిల్ రావిపూడి(anil Ravipudi) కాంబోలో వస్తున్న ఈ మూవీ సంక్రాంతికి రానున్నట్టు ఎప్పుడో ప్రకటించారు. ప్రశాంత్ నీల్(Prasanth Neel)- ఎన్టీఆర్(NTR) కాంబోలో రానున్న డ్రాగన్(Dragon) ను సంక్రాంతికి అని అన్నారు కానీ అది కుదిరే పనిలా కనిపించడం లేదు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్(Vijay) జననాయగన్(Jana Nayagan) ను రీసెంట్ గానే పండక్కి రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు.
అదే నిజమైతే బాలయ్య(Ballayya), చిరంజీవి(Chiranjeevi), విజయ్ పోటీ పడటం ఖాయం. గతంలో 2023లో కూడా వీరు ముగ్గురూ సంక్రాంతికి పోటీ పడ్డారు. చిరంజీవి నుంచి వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) రిలీజ్ కాగా, బాలయ్య(Balayya) నుంచి వీర సింహారెడ్డి(Veera simhareddy), విజయ్ నుంచి వారసుడు(Vaarasudu) సినిమాలొచ్చి సూపర్ హిట్లుగా నిలిచాయి. మరి ఈసారి కూడా ఈ ముగ్గురు గతంలో లానే మంచి హిట్లు అందుకుంటారేమో చూడాలి.













