టాలీవుడ్ టాప్ హీరోకి విలన్‌గా బాలీవుడ్ హీరో
నందమూరి బాలకృష్ణతో సింహా, లెజెండ్ వంటి బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన బోయపాటి శ్రీను కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బిబి3 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బాలకృష్ణ ఈ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తారు. ఒకటి ఫ్యాక్షనిస్ట్ పాత్ర కాగా, మరొకటి అఘోరా క్యారెక్టర్. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ఓ కొత్త హీరోయిన్ను తీసుకోబోతున్నట్టు బోయపాటి ప్రకటించాడు. అయితే ఈ సినిమాలో విలన్‌గా ఎవరు కనిపిస్తారనే విషయంలో ఇంతకుముందు క్లారిటీ లేదు. ఎందుకంటే మొదట్లో సంజయ్‌దత్ విలన్‌గా నటిస్తాడని అనుకున్నారు. కానీ, ఈ సినిమా చేసేందుకు సంజయ్ దత్ నో చెప్పాడు.
అయితే తాజా సమాచారం ప్రకారం సంజయ్ దత్ ఈ సినిమాలో విలన్‌గా నటించేందుకు ఓకే చెప్పాడని తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని సినిమాల్లో విలన్‌గా నటించి మెప్పించిన ఈ బాలీవుడ్ హీరో సంజయ్ దత్ విలనిజాన్ని బోయపాటి ఏ రేంజ్లో చూపిస్తాడో చూడాలి. ప్రస్తుతం యశ్ హీరోగా నటిస్తున్న కన్నడ సినిమా `కెజిఎఫ్2`లో సంజయ్ విలన్‌గా నటిస్తున్నాడు. అంతకుముందు `అగ్నిపథ్`, `పానిపట్` వంటి సినిమాల్లో విలన్‌గా ఓ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కరోనా ఎఫెక్ట్ వల్ల ప్రస్తుతం బాలకృష్ణ, బోయపాటి సినిమా షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయింది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు షూటింగులకు అనుమతులు ఇచ్చినప్పటికీ పెద్ద హీరోలెవరూ షూటింగ్ చేసేందుకు ముందుకు రావడం లేదు. అదీగాక ఈ సినిమా కోసం డేట్స్ కేటాయించిన మిగతా ఆర్టిస్టుల డేట్స్ అడ్డస్ట్ చేసుకోవాల్సి ఉంది. అన్నీ కుదిరితే సెప్టెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభించాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.













