యానిమల్తో సందీప్‌కు బాగానే ముట్టిందే
ఒకప్పుడు బాలీవుడ్ రామ గోపాల్ వర్మ ఓ దశాబ్ధానికి పైగా చక్రం తిప్పి ఆధిపత్యం చెలాయించాడు. డైరెక్టర్ గానే కాకుండా నిర్మాత కూడా ఆయన రికార్డ్స్ సృష్టించాడు. వర్మ తర్వాత చాలామంది సౌత్ డైరెక్టర్లు బాలీవుడ్లో తమ లక్ ను పరీక్షించుకున్నప్పటికీ గొప్ప రిజల్ట్ ఏమీ రాలేదు. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ కూడా బాలీవుడ్ లో చెరగని ముద్ర వేసుకుంటున్నాడు.
అర్జున్ రెడ్డి రీమేక్ గా కబీర్ సింగ్ చేసి, హిందీలో సంచలనం సృష్టించి ఏకంగా రూ.300 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టాడు. రీసెంట్ గా యానిమల్ తో రూ.800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి, బాలీవుడ్ లోనే ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్లలో ఒకటిగా నిలిపాడు. ఒక సౌత్ డైరెక్టర్ బాలీవుడ్ లో ఈ రేంజ్ లో దూసుకెళ్లడం మామూలు విషయం కాదు.
యానిమల్ క్రెడిట్ మొత్తం సందీప్‌దే. తనకోసమే చాలా మంది ఈ సినిమాను థియేటర్లకు వెళ్లి చూశారు. అయితే ఈ సినిమా ద్వారా సందీప్ ఎంత జేబులో వేసుకున్నాడనేది ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. యానిమల్ సినిమాకు దర్శకత్వంతో పాటూ, నిర్మాణ భాగస్వామిగా కూడా వ్యవహరించాడు సందీప్. దీంతో ఈ సినిమా ద్వారా సందీప్ కు రూ.200 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోగా నటించిన రణ్‌బీర్ రూ.70 కోట్లు రెమ్యూనరేషన్ అందుకోగా, అంతకు మూడింతలు ఎక్కువ సందీప్ ఈ సినిమాతో పొందాడు.













