సందీప్ తర్వాతి మూడు సినిమాలివే
సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ సినిమా మంచి హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర రూ.850 కోట్లకు పైగా కలెక్షన్లు అందుకుని, రూ.1000 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. విడుదలై మూడు వారాలవుతున్నప్పటికీ యానిమల్ థియేటర్లలో ఇప్పటికీ డీసెంట్ రన్ తో ముందుకెళ్తోంది.
ఫాదర్ అండ్ సన్ ఎమోషన్‌తో తెరకెక్కిన ఈ సినిమా రివెంజ్ డ్రామాగా తెరకెక్కి రణ్‌బీర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో హీరోతో పాటూ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కూడా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో ఈ సినిమా తర్వాత సందీప్ ఎవరితో సినిమాలు చేస్తాడా అని అందరికీ ఆసక్తి పెరిగింది.
యానిమల్ తర్వాత సందీప్, ప్రభాస్‌తో స్పిరిట్ మూవీ చేయనున్నాడన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరోతో సందీప్ రెడ్డి సినిమా చేస్తుండటంతో ఈ సినిమా రానుందన్న వార్తలొచ్చినప్పటి నుంచే మూవీపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. అయితే యానిమల్ సక్సెస్ అవడంతో దానికి సీక్వెల్ గా యానిమల్ పార్క్ ను మొదటిగా సెట్స్ పైకి తీసుకెళ్తారని, అది పూర్తయ్యాకే స్పిరిట్ ఉంటుందని గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి.
కానీ ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ క్లారిటీ ఇస్తూ సందీప్ రెడ్డి తో మరో మూడు ప్రాజెక్ట్స్ ను నిర్మించనున్నారు. సందీప్ రెడ్డి వంగాతో భూషణ్ ..స్పిరిట్‌తో పాటూ యానిమల్ పార్క్, అల్లు అర్జున్ ప్రాజెక్ట్స్‌ని నిర్మిస్తున్నట్లు చెప్పిన ఆయన వీటిలో ముందుగా స్పిరిట్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని క్లారిటీ ఇచ్చాడు.













