Sandeep Reddy Vanga: కాప్ యూనివర్స్ ను క్రియేట్ చేయనున్న సందీప్

ఈ మధ్య ఒక సినిమాను ఫ్రాంచైజ్ గా మార్చడం, లేదంటే ఓ యూనివర్స్ ను సృష్టించడం ట్రెండ్ గా మారింది. అందులో భాగంగానే ఇప్పటికే పలు ఫ్రాంచైజ్‌లు, యూనివర్స్ లు మొదలయ్యాయి. కాగా ఇప్పుడు టాలీవుడ్ లో మరో యూనివర్స్ రాబోతున్నట్టు తెలుస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas) హీరోగా సందీప్ రెడ్డి వంగా(sandeep reddy vanga) దర్శకత్వంలో రానున్న సంగతి తెలిసిందే.
స్పిరిట్(spirit) అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ గా నటించనున్నాడని ఇప్పటికే డైరెక్టర్ క్లారిటీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు స్పిరిట్ సినిమా తర్వాత సందీప్ ఓ కాప్ యూనివర్స్ ను సృష్టించాలని ప్లాన్ చేస్తున్నాడట. స్పిరిట్ సినిమా క్లైమాక్స్ ను సస్పెన్స్ తో ముగించి, తర్వాత పార్ట్ లో ఏమవుతుందోననే ఉత్కంఠను కలిగించాలని సందీప్ సన్నాహాలు చేస్తున్నాడని సమాచారం.
ఆల్రెడీ యానిమల్(animal) ఫ్రాంచైజ్ ను సృష్టించిన సందీప్, ఇప్పుడు స్పిరిట్ తో మరో ఫ్రాంచైజ్ ను స్టార్ట్ చేయాలని చూస్తున్నాడట. ప్రస్తుతం ది రాజా సాబ్(the raja saab) మూవీని పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉన్న ప్రభాస్, ఆ మూవీ రిలీజయ్యాక ఫిబ్రవరి నుంచి స్పిరిట్ ను మొదలుపెట్టనున్నట్టు తెలుస్తోంది. త్రిప్తీ డిమ్రీ(tripti Dimri) హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో ప్రభాస్ రెండు విభిన్న లుక్స్ లో కనిపించనుండగా, మొదటి షెడ్యూల్ ముంబైలో జరగనుంది. ముంబై షెడ్యూల్ లో ఓ ఫ్లాష్ బ్యాక్ సీన్ ను కూడా షూట్ చేయనున్నారట మేకర్స్. ముంబై షెడ్యూల్ తర్వాత మెక్సికో, థాయ్‌లాండ్, ఇండోనేషియా లాంటి ఇంటర్నేషనల్ లొకేషన్లలో కూడా ఈ మూవీ షూటింగ్ జరగనుంది.