వారం గ్యాప్ లో ఒకే బ్యాక్డ్రాప్లో వరుణ్, హృతిక్
తక్కువ గ్యాప్ లో రిలీజ్ అవుతున్న రెండు సినిమాలు ఒకే జానర్ కు చెందినవి అయితే ఆ రెండు సినిమాలను ఆడియన్స్ తెగ కంపేర్ చేస్తూంటారు. వచ్చే నెల 16న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఆపరేషన్ వాలెంటైన్ రిలీజ్ కానుంది. సోనీ పిక్చర్స్ బ్యానర్ ఈ సినిమాను చాలా భారీ బడ్జెట్ తో నిర్మించింది.
అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా డిసెంబర్ లో రిలీజవాల్సింది కానీ ఆ టైమ్ లో సలార్ వల్ల అన్ని సినిమాలు డేట్స్ మార్చుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఆపరేషన్ వాలెంటైన్ పోస్ట్ పోన్ చేసుకుని ఫిబ్రవరి 16కి రిలీజ్ ను షెడ్యూల్ చేసుకుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ కు కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఈ సినిమా కంటే ముందు జనవరి 25న హృతిక్ రోషన్ హీరోగా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఫైటర్ సినిమా కూడా వస్తోంది. ఈ సినిమా ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లోనే కొనసాగుతుంది. ఫైటర్ లో హృతిక్, ఆపరేషన్ వాలెంటైన్ లో వరుణ్ ఇద్దరూ పైలెట్లే. పాకిస్థాన్ వల్ల దేశానికి ముప్పు తలెత్తితే ఆ మిషన్ తాలూకు బాధ్యతను తీసుకుని ప్రాణాలకు తెగించి దేశాన్ని కాపాడటమే మెయిన్ పాయింట్ గా కనిపిస్తోంది. బ్యాక్ డ్రాప్ ఒకటే కావడంతో రెండు సినిమాలకు పోలిక పెట్టడం సహజం. ముందొచ్చిన సినిమా హిట్ అయితే, రెండో సినిమాకు ముప్పు రావడం ఖాయం. వరుణ్ తేజ్ సినిమా కూడా పాన్ ఇండియా రిలీజ్ కు ప్లాన్ చేసుకుంది కానీ ప్రస్తుతానికైతే హిందీ వెర్షన్ ఒకటే అంటున్నారు. మరి ఈ రెండు సినిమాల్లో ప్రేక్షకుల్ని ఏ సినిమా మెప్పిస్తుందో చూడాలి.













