సమంత సంచలన నిర్ణయం?
‘ఏ మాయ చేసావె’ చిత్రంతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన సమంత తన తొలి తెలుగు హీరో నాగచైతన్యతోనే ప్రేమలో పడింది. ఆ ప్రేమ పెళ్ళి వరకు వచ్చింది. పెళ్ళి తర్వాత కూడా సినిమాలపైనే దృష్టి పెట్టింది సమంత. తన పది సంవత్సరాల కెరీర్లో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించి అందరి చేత శభాష్ అనిపించుకుంది.
ఇటీవలి కాంలో సమంత చేసిన సినిమాలన్నీ సూపర్‌హిట్ అయ్యాయి. ఆయా సినిమాల్లో ఆమె చేసిన పాత్రలకు మంచి ప్రశంసలు భించాయి. అయితే ఈమధ్య విడుదలైన ‘జాను’ ఆమె విజయ పరంపరను అడ్డుకుంది. ‘జాను’ తర్వాత సమంత మరో సినిమా సైన్ చెయ్యలేదు. ఆమె డిజిటల్ రంగంవైపు దృష్టి పెట్టిందని, అందుకే మరో సినిమా అంగీకరించలేదని తెలుస్తోంది. ద ఫ్యామిలీ మ్యాన్ 2 పేరుతో రూపొందే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది సమంత. ఈ వెబ్ సిరీస్‌లో ఆమె నెగెటివ్ రోల్ చేస్తోంది. కొత్త సినిమా సైన్ చెయ్యకపోవడానికి మరో కారణం కూడా ఉందని వార్తలు వస్తున్నాయి. అదేమిటంటే ఆమె తల్లి కాబోతోందని, అందుకే కొత్త సినిమాలను అంగీకరించడం లేదని చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే తన నెక్స్ట్ సినిమా నాగచైతన్యతోనే చేయబోతోందని సమాచారం. నందినిరెడ్డి దర్శకత్వంలో రూపొందే ఓ సినిమాలో మరోసారి ఈ జంట కలిసి నటించనుంది.
సొంత బేనర్
సమంత ఇప్పుడు అక్కినేని వారి కోడలు. వారికి అన్నపూర్ణ స్టూడియోస్ అనే ప్రతిష్ఠాత్మక సంస్థ ఉంది. ఈ బేనర్ నుంచి ఎన్నో అపురూప చిత్రాలు, ఎన్నో కమర్షియల్ బ్లాక్‌బస్టర్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ కుటుంబం నుంచి మరో కొత్త నిర్మాణ సంస్థ రాబోతోందట. సమంత ఆధ్వర్యంలోనే ఆ సంస్థ ప్రారంభం కాబోతోందని సమాచారం. నాగచైతన్యతో కలిసి వ్యాపారం స్టార్ట్ చెయ్యాలన్నది సమంత కోరిక అని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చెయ్యబోతున్నారన్న వార్త వినిపిస్తోంది. అక్కినేని ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయా, అందువల్లే సమంత సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించాలనుకుంటోందా అనే అనుమానాలు అందరిలోనూ కలుగుతున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని అక్కినేని అభిమానులు స్పష్టం చేస్తున్నారు.













