నాగ చైతన్యపై సమంత కౌంటర్
ఏ మాయ చేశావె సినిమాతో కెరీర్ ను స్టార్ట్ చేసిన సమంత, ఆ సినిమాలోని హీరో నాగచైతన్యను ప్రేమించి, ఎంతో కాలం తర్వాత ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లి ఒకటయ్యారు. కానీ మూడేళ్లు తిరిగే సరికి వారి మధ్య మనస్పర్థల కారణంతో విడిపోయారు. నాలుగో సంవత్సరంలో చైతూ, సమంత ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.
విడాకులు తీసుకున్న తర్వాత దాని గురించి చైతన్య పొడిపొడిగా మాట్లాడుతూ, ఇద్దరి మంచి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. కానీ సమంత మాత్రం విడాకుల గురించి ఎప్పుడు ప్రస్తావించినా ఆవేదనభరితంగానే సమాధానమిస్తూ ఉంటుంది. ఇప్పటికే గతంలో చైతూని ఉద్దేశించి ఇన్‌డైరెక్ట్ గా కౌంటర్స్ వేసిన సమంత, ఇప్పుడు మరోసారి చైతూ గురించి నెగిటివ్ కామెంట్ చేసింది.
సోషల్ మీడియా చిట్ చాట్ లో భాగంగా సమంతను ఓ అభిమాని మీరు జీవితంలో నేర్చుకున్న అతి పెద్ద పాఠమేంటని అడగ్గా, అందుకు సమంత బదులిస్తూ, తన ఇష్టాయిష్టాలను తానే తెలుసుకోలేకపోవడమే పెద్ద వైఫల్యమని, తన గత భాగస్వామి తన ఇష్టాయిష్టాలను ప్రభావితం చేసినట్లు ఆమె వ్యాఖ్యానించింది. అంటే ఇన్‌డైరెక్ట్ గా చైతూ కోసం తన ఇష్టాయిష్టాలను మార్చుకోవాల్సి వచ్చిందని సమంత చెప్పింది.













