చైతూ-సామ్ ల హనీమూన్ ఎక్కడో తెలుసా?
సమంత- నాగచైతన్యకు ఈ నెల 6, 7 తేదీలలో ఇటు హిందూ అటు క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న ఈ జంట ప్రస్తుతం లండన్ వీధులో చక్కర్లు కొడుతున్నట్లు తెలుస్తుంది. పెళ్ళి తర్వాత సమంత తాను నటించిన రాజు గారి గది సినిమా ప్రమోషన్ లొ పాల్గొని, ఆ తర్వాత మహానటి చిత్రంలో కొన్ని సీన్స్ కూడా చేసిందని టాక్. అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కొన్ని ఫోటోలని బట్టి చూస్తుంటే చైతూ-సామ్ ల జంట హనీమూన్ కోసం లండన్ వెళ్ళారని సమాచారం. అక్కడి బ్రిటీష్ మ్యూజియంకి వెళ్ళి శిల్ప సౌందర్యాన్ని చూసిన తర్వాత ఆ పక్కనే ఉన్న హోటల్ లో లంచ్ చేసి అక్కడ నుండి పక్కనే ఉన్న గుక్కి అనే బ్రాండ్ స్టోర్‌కి కూడా వెళ్లారని తెలుస్తోంది. అయితే చైతూ కాఫీ తాగుతున్న వీడియోని సమంత తన స్నేహితులకి షేర్ చేయడంతో ఈ విషయం బయటకి వచ్చిందని చెబుతున్నారు. ఇక లండన్ తరువాత ఈ జంట స్కాట్‌ల్యాండ్ మరియు బెల్ ఫాస్ట్ కూడా చుట్టేస్తారని ప్రచారం జరుగుతోంది.













