Samantha: ధ్యానం చేయమంటున్న సమంత
ధ్యానం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని, ప్రతీ రోజూ 15 నిమిషాలు మెడిటేషన్(Meditation) చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) సోషల్ మీడియా ద్వారా తెలిపింది. సైలెంట్ గా కూర్చుని శ్వాస మీద ధ్యాస పెడితే ప్రశాంతంగా ఉంటుందని చెప్తూ ఓ వీడియోని ఇన్స్టాలో షేర్ చేసింది సమంత.
తన లైఫ్ లో మెడిటేషన్ చాలా బాగా ఉపయోగపడిందని, ప్రశాంతంగా ఉండాలంటే దానికి మెడిటేషనే కరెక్ట్ అని సమంత చెప్పింది. ప్రపంచం ఎలా ఉన్నా, తాను ప్రశాంతంగా ఉండటానికి గల కారణం ధ్యానమే అని, మీరు కూడా మెడిటేషన్ చేస్తే శాంతి లభిస్తుందని ఈ సందర్భంగా సమంత తెలిపింది. మీ మనసులోని ఆలోచనలను పక్కన పెట్టి మెడిటేషన్ చేస్తే మంచి ఫలితాలుంటాని, ప్రతీ ఒక్కరినీ మెడిటేషన్ చేయమని సమంత సూచించింది.
ఇప్పుడు మెడిటేషన్ చేయమంటున్న సమంత వారం రోజుల క్రితం తాను ఓ మంచి అలవాటుని రెండేళ్లుగా ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలిపింది. రెగ్యులర్ గా తాను డైరీలో ఎవరికి థాంక్స్ చెప్పాలి? ఎందుకు చెప్పాలి? ఎవరికి గ్రేట్ఫుల్ గా ఉండాలి? ఎందుకుండాలనే విషయాలను రాసుకుంటూ వచ్చానని, అలా రాసుకోవడం తన లైఫ్ లో గేమ్ ఛేంజర్ లా ఉపయోగపడిందని అందరినీ ఆ అలవాటు చేసుకోమని చెప్పింది. ఇక సినిమాల విషయానికొస్తే సమంత రీసెంట్ గానే సిటాడెల్(Citadel) వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకొచ్చింది.













