సల్మాన్ ఖాన్ అభిమానులకు శుభవార్త
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ భారత్ మూవీ విజయంతో మరో మారు రంజాన్ హీరోగా తనసత్తా చాటారు. ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ టాక్‌తో ఈ మూవీ రికార్డు వసూళ్ల దిశగా దూసుకుపోతుంది. సల్మాన్ సరసన కత్రినా, దిశా పటాని నటించిన ఈ మూవీని అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కించారు. సల్మాన్ ఫ్యాన్స్ భారత్ విజయాన్ని ఆస్వాదిస్తుండగానే ఆయన తదుపరి రంజాన్ మూవీ గురించి ఓ శుభవార్త బయటకొచ్చింది. బాలీవుడ్ అగ్రదర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో అలియా భట్ హీరోయిన్గా ఇన్షా అల్లా అనే మూవీని చేయనున్నారట. ఈ విషయాన్ని యంగ్ హీరోయిన్ అలియాభట్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. సంజయ్‌లీలా భన్సాలీ గతంలో దేవదాస్, బాజీరావ్ మస్తానీ, పద్మావతి వంటి భారీ ఎపిక్ మూవీస్‌కు దర్శకత్వం వహించారు. ఇన్షా అల్లా చిత్రం 2020 రంజాన్ కానుకగా విడుదల కానుందట. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ మూవీని సల్మాన్, బన్సాలీ కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారని తెలిసింది.













