సలార్.. బిగ్గెస్ట్ ఎవర్ రిలీజ్ ..
గత పదేళ్లలో ఇండియన్ సినిమా పరిధి గ్లోబల్ స్థాయిలో పెరుగుతూ పోతున్న నేపథ్యంలో విదేశాల్లో కూడా మన చిత్రాలు పెద్ద ఎత్తున రిలీజవుతున్నాయి. ముఖ్యంగా ఫారిన్లో మనకు అతి పెద్ద మార్కెట్ ఉన్న ఉత్తర అమెరికాలో ఒకప్పుడు వంద లొకేషన్లలో సినిమాను రిలీజ్ చేయడం కూడా గొప్పగా చెప్పుకునేవాళ్లం. కానీ ఇప్పుడక్కడ 500 లొకేషన్లలో మన చిత్రాలు రిలీజవుతున్నాయి.
గత కొన్నేళ్లుగా ఇండియన్ సినిమా రేంజ్ గ్లోబల్ స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో కాకుండా విదేశాల్లో కూడా మన సినిమాలు చాలా ఎక్కువ సంఖ్యలో రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర అమెరికాలో ఒక సినిమా వంద లొకేషన్లలో సినిమాను రిలీజ్ చేశారంటే ఒకప్పుడు అది చాలా గొప్ప విషయంగా భావించేవారు.
కానీ ఇప్పుడు అక్కడ 500 లొకేషన్లలో మన సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. బాహుబలి-2, ఆర్ఆర్ఆర్, పఠాన్ లాంటి సినిమాలు వెయ్యికి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి హాలీవుడ్ సినిమాల స్థాయిలో సందడి చేశాయి. ఇక అసలు విషయానికి వస్తే ఇప్పటి వరకు ఉన్న ఈ రికార్డులన్నింటినీ సలార్ సినిమా కొట్టేయబోతుంది. సలార్ సినిమా ఉత్తర అమెరికాలో ఏకంగా 1979 స్క్రీన్లలో రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
ప్రత్యంగిర సినిమాస్, సలార్ సినిమా ఉత్తర అమెరికా రైట్స్ ను కొనుగోలు చేసి, ఈ స్టేట్మెంట్ను అధికారికంగా ప్రకటించింది. ఇండియన్ సినిమాలోనే ఇది బిగ్గెస్ట్ రిలీజ్. రిలీజ్ కు రెండు నెలల ముందే ప్రభాస్ సలార్ కు ఈ రకం క్రేజ్ ఉందంటే రిలీజ్ టైమ్ కు ఈ స్క్రీన్ల కౌంట్ పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ముందు నుంచి ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్న నేపథ్యంలో రీసెంట్ గా వచ్చిన టీజర్ ఆ అంచనాలను మరింత పెంచింది.













