సైతాన్ టీమ్ తెలివైన ప్లాన్
ఏదైనా సినిమాను రీమేక్ చేస్తుంటే ఆ టైమ్ లో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే సినిమాకు రావాల్సిన క్రేజ్ రాదు. అందులో మొదటిది సినిమా ఒరిజినల్ వెర్షన్ ఏ ఓటీటీలో లేకుండా చూసుకోవాలి. రెండోది స్టార్ క్యాస్టింగ్. అప్పట్లో చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా విషయంలో టీమ్ నిర్లక్ష్యంగా వ్యవహరించింది.
గాడ్ ఫాదర్ కంటే ముందే తెలుగులో అందుబాటులో ఉన్న లూసిఫర్ తెలుగు డబ్బింగ్ ను చూశారు ఆడియన్స్. ఫలితంగా కథేంటో ముందే అందరికీ తెలిసిపోయింది. భీమ్లా నాయక్ కూడా ఎంతో మంది సబ్ టైటిల్స్ తో చూశారు. ఇప్పుడు ఇలాంటి పొరపాట్లను చేయకుండా సైతాన్ టీమ్ ఎంతో జాగ్రత్తలు పడుతోంది. మార్చి 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో అజయ్ దేవగణ్, జ్యోతిక నటిస్తుండగా మాధవన్ విలన్ పాత్రలో నటించాడు. ఈ సినిమా గుజరాతీ సినిమా వష్ కు అధికారిక రీమేక్ గా తెరకెక్కుతుంది. హిందీలో ఈ సినిమాను రీమేక్ చేయాలనుకుని ఫిక్స్ అవగానే సినిమాను ఓటీటీలోకి రాకుండా ఎంతో జాగ్రత్త పడ్డారు. దీంతో నెటిజన్లు ఈ సినిమా కోసం ఆన్ లైన్ లో ఎంత వెతికినా సినిమా కనిపించలేదు. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ చూస్తుంటే మాధవన్ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని అనిపిస్తుంది. సినిమా ప్రమోషన్స్ ను కూడా చిత్ర యూనిట్ చాలా స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నటు ప్రచారం జరుగుతుంది.













