సాయి పల్లవి రూటే సపరేటు
పక్కింటి అమ్మాయిలా టాలీవుడ్ ఆడియన్స్ కు దగ్గరైన సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పేదేముంది. తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ స్పెషల్ ప్లేస్ సంపాదించుకున్న సాయి పల్లవి ఫిదా సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుని ఎంతో సహజమైన నటనతో ఆకట్టుకుంది. అప్పటినుంచి సాయి పల్లవి అంటే తెలంగాణ పిల్ల అని బాగా ఫేమస్ అయిపోయింది.
అప్పటినుంచి సాయి పల్లవి ఏ సినిమా చేసినా తానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటుంది. వేరే భాషల్లో కూడా ఇదే ట్రెండ్ ను కంటిన్యూ చేస్తున్న సాయి పల్లవి ప్రస్తుతం నాగ చైతన్య సరసన తండేల్ లో నటిస్తుంది. ఈ సినిమాలో సాయి పల్లవి ఉత్తరాంధ్ర జాలర్ల నేపథ్యమున్న పాత్రలో నటిస్తోంది. ఈ పాత్ర కోసం కూడా అమ్మడు స్పెషల్ గా సన్నద్ధమవుతుంది.
ప్రస్తుతం సాయిపల్లవి ఉత్తరాంధ్ర యాస నేర్చుకుంటున్నట్లు సమాచారం. దాని కోసం స్పెషల్ ట్రైనర్ ను కూడా నియమించుకుని ఉదయం, సాయంత్రం అదే పని మీదుంటుందట. దీంతో పాటూ బాలీవుడ్ లో రామాయణ్ సినిమాలో సీత పాత్ర కోసం హిందీ నేర్చుకోవడానికి నార్త్ నుంచి ఓ హిందీ ట్రైనర్ ను కూడా నియమించుకుందట. మొత్తానికి అమ్మడు ఏ భాషలోకి వెళ్తే ఆ భాషను అవపోశాన పట్టేస్తూ అక్కడి ఆడియన్స్ మనసుల్ని గెలుచుకుంటూ ఆమె రూటే సపరేటు అనిపించుకుంటోంది.













