Thandel: చైతన్యను ఆకాశానికెత్తేస్తున్న సాయి పల్లవి
నాగ చైతన్య(Naga Chaitanya), సాయి పల్లవి(Sai Pallavi) హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా తండేల్(Thandel). చందూ మొండేటి(Chandoo Mondeti) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయింది. ఫిబ్రవరి 7న తండేల్ పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. చైతూ కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో తండేల్ ను గీతా ఆర్ట్స్2(Geetha Arts2) బ్యానర్లో బన్నీ వాసు(Bunny Vaasu) నిర్మించాడు.
రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో తండేల్ టీమ్ ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. ప్రమోషన్స్ లో భాగంగా సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో తన తోటి నటుడైన నాగ చైతన్య నటనకు ఓ రేంజ్ లో ఎలివేషన్లు ఇచ్చింది. తండేల్ సినిమాలో ఓ సీక్వెన్స్ లో చైతన్య నటనను మ్యాచ్ చేయడానికి తాను రీ టేక్ చేయాల్సి వచ్చిందని సాయి పల్లవి తెలిపింది.
సాయి పల్లవి చెప్పినదాన్ని బట్టి చూస్తే సినిమాలో చైతన్య పెర్ఫార్మెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా కోసం చైతన్య ఎంతో శ్రమ పడ్డాడని ముందు నుంచి అందరూ చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు సాయి పల్లవి కూడా చైతన్య నటనని ప్రశంసించింది. ఇదిలా ఉంటే వీరిద్దరూ కలిసి గతంలో లవ్ స్టోరీ(Love Story) అనే సినిమా చేయగా ఆ సినిమా మంచి హిట్ గా నిలిచిన నేపథ్యంలో ఇప్పుడు తండేల్ పై అంచనాలు భారీగా ఉన్నాయి.













