రాజా సాబ్ సినిమాపై పుకార్లు
కల్కి సినిమాతో సుమారు రూ.1200 కోట్ల వసూళ్లు సాధించి ప్రభాస్ రికార్డులను సృష్టించిన విషయం తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ డ్రామాగా వచ్చిన ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి తన సత్తా ఏంటో చూపించాడు. ఓటీటీలో కూడా కల్కి బాగానే పెర్ఫార్మ్ చేస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ సినిమలో నటిస్తున్నాడు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాపై పలు రకాల ఊహాగానాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రాజా సాబ్ ఆడియో రైట్స్ ను అంతగా పాపులర్ అవని మ్యూజిక్ లేబుల్ కంపెనీకి నిర్మాతలు రూ.15 కోట్లకు అమ్మేసినట్లు వార్తలొస్తున్నాయి. ఈ విషయం ప్రభాస్ ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది.
అయితే ఈ వార్తలన్నీ పుకార్లేనని నిజం కాదని చిత్ర యూనిట్ సభ్యులు చెప్తున్నారు. ఇలాంటి వార్తల్లో ఎలాంటి ప్రకటన అయినా సరే ప్రొడక్షన్ హౌస్ నుంచి కన్ఫర్మేషన్ వస్తుందని గాసిప్స్ ను నమ్మొద్దని, కావాలనే కొంతమంది ప్రభాస్ రేంజ్‌ను దెబ్బ తీయడానికి ఇలాంటి వార్తలు సృష్టిస్తున్నారని అంటున్నారు. కాగా ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లు గా నటిస్తున్నారు.













