Trisha: త్రిష పెళ్లిపై మరోసారి వార్తలు
పొన్నియన్ సెల్వన్(Ponniyan Selavn) సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుని తిరిగి ఫామ్ లోకి వచ్చిన సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష(Trisha) కు ఆ సినిమా తర్వాత వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) సరసన విశ్వంభర(Viswambhara) చేస్తున్న త్రిష, అజిత్(Ajith) తో గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Ugly) సినిమాతో పాటూ కమల్ హాసన్(Kamal Haasan) సరసన థగ్ లైఫ్(Thug Life) సినిమాలోనూ నటిస్తోంది. సీనియర్ హీరోలతో బిజీగా ఉన్న త్రిష పెళ్లి గురించి రోజురోజుకీ అందరికీ ఆసక్తి పెరిగిపోతుంది.
త్రిష తాజాగా తన ఇన్‌స్టాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో రమ్యకృష్ణ(Ramya Krishna), రాధికా శరత్‌కుమార్(Radhika Sarath Kumar) తో పాటూ జ్యోతిక(Jyothika) కూడా ఉన్నారు. వీళ్లంతా కలిసి ఓ నైట్ పార్టీలో కలిశారు. ఫోటోలు చూడ్డానికి నార్మల్ గానే అనిపిస్తున్నప్పటికీ త్రిష ఫ్యాన్స్ మాత్రం దాన్ని బ్యాచిలర్ పార్టీ లేదటే పెళ్లి పార్టీ అని చెప్తూ సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తున్నారు.
అయితే త్రిష పెళ్లి గురించి వార్తలు రావడం ఇదేమీ మొదటిసారి కాదు. కొన్ని నెలల కిందట పెళ్లి కూతురు బట్టల్లో కనిపించి హడావిడి చేసింది త్రిష. ఇప్పుడు మళ్లీ ఇలా ఓ నైట్ పార్టీలో వైట్ ఫ్రాకులో కనిపించి ఫ్యాన్స్ అటెన్షన్ ను లాగేసుకుంది. అయితే వరుస అవకాశాలతో బిజీగా ఉన్న త్రిష ఇప్పుడు పెళ్లి చేసుకుని ఇటు పర్సనల్ లైఫ్ ను, అటు ప్రొఫెషనల్ లైఫ్ ను మేనేజ్ చేస్తుందా లేదా ఒకేసారి సినిమాలు పూర్తయ్యాక పెళ్లి గురించి ఆలోచిస్తుందా అని త్రిష పెళ్లి గురించి అందరికీ ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది.













