Rukmini Vasanth: రుక్మిణి ఆఫర్లకు నీల్ ఒప్పుకుంటాడా?

ఎన్టీఆర్(NTR) హీరోగా ప్రశాంత్ నీల్(Prasanth Neel) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌నీల్(NTRNeel) వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో సప్త సాగారాలుదాటి(Sapta Sagaralu Daati) ఫ్రాంచైజ్ ఫేమ్ రుక్మిణి వసంత్(Rukmini Vasanth) హీరోయిన్ గా నటిస్తోందని, ఈ సినిమా కోసం మేకర్స్ తనతో ఓ స్పెషల్ డీల్ ను కూడా కుదుర్చుకున్నారని సమాచారం. ఈ మూవీ షూటింగ్ ఉన్నన్ని రోజులు రుక్మిణి మరో ప్రాజెక్టు చేయడానికి వీల్లేదనేదే ఆ డీల్.
ఇదిలా ఉంటే ఇప్పుడు రుక్మిణికి పలు ఆఫర్లు వస్తున్నట్టు సమాచారం. త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్(Venkatesh) హీరోగా రానున్న సినిమా కోసం రుక్మిణిని తీసుకోవాలని చూస్తున్నారట మేకర్స్. ఇప్పటికే త్రివిక్రమ్(Trivikram), రుక్మిణికి స్క్రిప్ట్ ను కూడా వినిపించాడని అంటున్నారు. దీంతో పాటూ మరో వార్త కూడా నెట్టింట వైరల్ అవుతుంది. సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) డైరెక్షన్ లో రానున్న స్పిరిట్(Spirit) సినిమాలో కూడా రుక్మిణి నటించనుందని అంటున్నారు.
రుక్మిణికి ఆఫర్లు వచ్చినప్పటికీ ప్రశాంత్ నీల్ దానికి పర్మిషన్ ఇస్తాడా అనేది ఇప్పుడో ప్రశ్నగా మారింది. ఎన్టీఆర్‌నీల్ సినిమాతో స్పెషల్ డీల్ సెట్ చేసుకున్న రుక్మిణికి వేరే ప్రాజెక్టులు చేసే ఛాన్స్ ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. వెంకటేష్- త్రివిక్రమ్, ప్రభాస్- సందీప్ రెడ్డి వంగా ప్రాజెక్టులతో పాటూ థగ్ లైఫ్(Thug Life) తర్వాత మణిరత్నం(mani Ratnam) చేయబోయే లవ్ స్టోరీలో కూడా రుక్మిణినే అనుకుంటున్నారని సమాచారం. మరి ఎంతవరకు అది వీలవుతుందో చూడాలి.