Rukmini Vasanth: ఆయన గురించి చెప్పడానికి ఒక్క పదం సరిపోదు

కోలీవుడ్ స్టార్ యాక్టర్ శివ కార్తికేయన్(siva karthikeyan) హీరోగా, రుక్మిణి వసంత్(rukmini vasanth) హీరోయిన్ గా మురుగదాస్(murugasoss) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మదరాసి(madarasi). సెప్టెంబర్ 5న రిలీజ్ కానున్న ఈ సినిమాను ఎన్వీ ప్రసాద్(NV Prasad) భారీ బడ్జెట్ తో నిర్మించగా, రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. అందులో భాగంగానే రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించగా అందులో రుక్మిణి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారింది.
మదరాసి సినిమాలో రుక్మిణిని తీసుకునే సమయానికి ఆమె చేతిలో భారీ ప్రాజెక్టులేమీ లేవని, కానీ ఇప్పుడు ఎన్టీఆర్(NTR) మూవీతో పాటూ యష్(Yash) టాక్సిక్(Toxic) లో కూడా నటిస్తుందని, ఎన్టీఆర్ నీల్(NTRNeel) మూవీలో హీరోయిన్ రుక్మిణినే అనే విషయాన్ని కన్ఫర్మ చేశారు. అయితే మొదటి నుంచి డ్రాగన్(Dragon) లో రుక్మిణినే ఫీమేల్ లీడ్ అంటున్నారు తప్పించి ఇప్పటివరకు దాని గురించి ఎలాంటి అనౌన్స్‌మెంట్ రాలేదు. కానీ ఇప్పుడు అది అఫీషియల్ అయిపోయింది.
ఇక ఈ ఈవెంట్ లో యాంకర్ సుమ(Suma) ఒక్కొక్కరి గురించి వన్ వర్డ్ లో చెప్పాలంటే ఏం చెప్తారని కొందరు పేర్లు చెప్పగా రుక్మిణి వాటికి సమాధానమిచ్చింది. శివ కార్తికేయన్ ఎక్ట్స్రార్డినరీ అని, మురుగదాస్ ఎనర్జిటిక్ అని, ఎన్వీ ప్రసాద్ సపోర్టివ్ అని, అనిరుధ్(anirudh) మల్టీ టాలెంటెడ్ అని చెప్పగా, ఎన్టీఆర్ గురించి చెప్పడానికి ఒక్క పదం సరిపోదని, ఒక డిక్షనరీ ఉంటుందని చెప్పింది రుక్మిణి. ప్రస్తుతం ఈ వీడియోను ఎన్టీఆర్(NTR) ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.