ARI: నేటి సమాజానికి కావాల్సిన సినిమా “అరి” – ఆర్ఎస్ఎస్ సేన నాయకుల డిమాండ్

“అరి” (Ari) సినిమాలో ఏముందో తెలుసుకోకుండా ఈ చిత్రంపై దుష్రచారం చేస్తూ, పోస్టర్స్ చించేస్తున్న వారు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఆర్ఎస్ఎస్ సేన నాయకులు. నేటి సమాజానికి, యువతకు ఈ సినిమా చాలా అవసరం అని, తప్పుదారిలో వెళ్తున్న సమాజానికి మంచిని చెప్పే ప్రయత్నం “అరి” సినిమాతో దర్శకుడు జయశంకర్ చేశారని ఆర్ఎస్ఎస్ సేన నాయకులు అన్నారు. ఈ రోజు హైదరాబాద్ సప్తగిరి థియేటర్ వద్ద సినిమా చూసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
ఓ పార్టీ నేతలు “అరి” సినిమా పోస్టర్స్ చింపుతూ, ఈ చిత్ర విజయాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి వారు సినిమా చూసి మాట్లాడాలని ఆర్ఎస్ఎస్ సేన నేతలు అన్నారు. దుష్ప్రచారం చేస్తున్న వారు “అరి” చిత్ర బృందానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
“అరి” సినిమాను ఆర్వీ సినిమాస్ పతాకంపై రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి ( ఆర్ వీ రెడ్డి ) సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, డి, శేషురెడ్డి మారంరెడ్డి, డా. తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, బీరం సుధాకర్ రెడ్డి నిర్మించారు, లింగ గుణపనేని కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటించారు. జయశంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 10న థియేటర్స్ లోకి వచ్చి, ప్రేక్షకాదరణ పొందుతోంది.