ఆర్ ఆర్ ఆర్ కి… టైటిల్ ఖరారు
ట్రిపులార్ (ఆర్.ఆర్.ఆర్)కి పుల్ఫామ్ వచ్చేంది. రఘుపతి రాఘవ రాజారాంగా ఖరారు చేశారు. బహు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి ఇంతకంటే మంచి పేరు దొరకడం కష్టమని చిత్ర యూనిట్ ఫిక్సయింది. దేశభక్తి నేపధ్యంలో మన దేశానికి స్వాతంత్య్రం రావడానికి ముందు జరిగిన కథతో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతోంది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్, ఆలియాభట్, సముద్రఖని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన నటించే ఫారిన్ భామ కోసం ఇంకా అన్వేషణ కొనసాగుతుండగా.. మరో లవ్ ఇంట్రెస్ట్‌గా నిత్యామీనన్‌ను ఎంపిక చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి.













