ఫ్యామిలీ స్టార్లో ఆ సీన్స్?
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ సీన్ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రలో నటించడానికైనా, ఏ సీన్ చేయడానికి కూడా వెనుకాడడు. అందుకే విజయ్ను డైరెక్టర్స్ హీరో అంటారు. అర్జున్ రెడ్డి, డియర్ కామ్రేడ్ సినిమాలతో రొమాంటిక్ ట్యాగ్ ని సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ, గీత గోవిందం లాంటి ఫ్యామిలీ సినిమాలో కూడా లిప్ లాక్ పెట్టి ఆ సినిమాకు రొమాంటిక్ టచ్ ఇచ్చాడు.
అలాంటి విజయ్ ను ఇప్పుడు పరుశురామ్ పెట్ల ఫ్యామిలీ స్టార్ గా మలుస్తున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ స్టార్ మూవీలో ఘాటైన హాట్ సీన్స్, లిప్ లాక్స్ ను హైలైట్ చేయనున్నాడట పరుశురామ్. గీత గోవిందం లానే ఈ సినిమాలో కూడా తనదైన మార్క్ రొమాన్స్ ను ఎలివేట్ చేయాలని పరుశురామ్ చూస్తున్నాడట.
స్క్రిప్ట్ డిమాండ్ చేయడం వల్లే ఈ డెసిషన్ తీసుకున్నారని ఇన్సైడ్ టాక్. కాకపోతే తన గత చిత్రాల కంటే ఈ సినిమాలో రొమాన్స్ డోస్ కాస్త ఎక్కువ ఉంటుందని సమాచారం. ఇప్పటి వరకు డీసెంట్ రోల్స్ లో మెప్పించిన మృణాల్ మొదటిసారి ఫ్యామిలీ స్టార్ లో రొమాంటిక్ సీన్స్ లో నటించబోతోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతన్నది తెలియాలంటే మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సిందే.













